Mahesh Babu workout photo gone viral in social media
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో తన వర్క్ అవుట్ వీడియోలు షేర్ చేస్తూ వస్తుంటాడు. జిమ్ లో తాను పాటించే ఫైట్‌నెస్ మంత్రాన్ని అభిమానులతో కూడా షేర్ చేస్తూ వర్క్ అవుట్ పాటలు నేర్పుతుంటాడు. ఇక అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటుంటాయి. తాజాగా మహేష్ మరో ఫోటోని షేర్ చేశాడు. సూపర్ స్ట్రెచ్ అంటూ ఒక కొత్త వర్క్ అవుట్ ని నేర్పిస్తున్నాడు.
Hi Nanna : ‘హాయ్ నాన్న’ నుంచి ఫస్ట్ సింగల్ ప్రోమో రిలీజ్.. సమయమా..!
అది ఎలా చేయాలో చెబుతూ, చేస్తూ అభిమానుల ముందుకు వచ్చాడు.రెండు చేతులు తల వెనుక పెట్టి.. భుజాన్ని పేస్ ని పక్కకి తిప్పి ఉంచాడు. వెన్నుపూసకు, భుజాలకు అది కూడా ఒక చికిత్స అంటూ మహేష్ రాసుకొచ్చాడు. మరి మహేష్ చెబుతున్న ఆ వర్క్ అవుట్ పాఠాన్ని ఒకసారి మీరు కూడా చూసి ట్రై నేర్చుకోండి.
ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ఫ్యామిలీ వెకేషన్ నుంచి వచ్చిన మహేష్ గుంటూరు కారం (Guntur Kaaram) షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ చాలా లేటు అవ్వడంతో దర్శకుడు త్రివిక్రమ్ శరవేగంగా షూటింగ్ ని నడుపుతున్నాడు. పక్కా మాస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు మునుపెన్నడూ కనబడనంత మాస్ గా కనిపించబోతున్నాడు.
Devil : కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ మూవీ దర్శకనిర్మాతల మధ్య విబేధం.. ట్వీట్ వైరల్!
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన మహేష్ లుక్స్ అన్ని అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. శ్రీలీల (Sreeleela), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) మహేష్ కి జోడిగా నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఒక సాంగ్ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ వినాయక చవితి పండక్కి ఏమన్నా అప్డేట్ ఇస్తారా..? లేదా అనేది చూడాలి.