మహేష్ ‘మహర్షి’ మూవీ మళ్లీ వాయిదా..!

  • Published By: vamsi ,Published On : February 23, 2019 / 10:20 AM IST
మహేష్ ‘మహర్షి’ మూవీ మళ్లీ వాయిదా..!

Updated On : February 23, 2019 / 10:20 AM IST

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. మహేష్‌ 25వ సినిమాగా రూపొందుతున్న మహర్షి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. భరత్‌ అనే నేను వంటి సూపర్ హిట్ సినిమా తరువాత మహేష్ నటిస్తున్న సినిమా కావటం ఫస్ట్ లుక్ ఆకట్టుకోవడంతో సినిమాపై అభిమానులు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగా దిల్‌ రాజు, అశ్వనీదత్‌, పీవీపీ దిగ్గజ నిర్మాతలు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

దీంతో ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఏప్రిల్ నెలాఖరున మహర్షి సినిమా రిలీజ్‌ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. మేకింగ్ లో ఆలస్యం కారణంగా ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్టు చిత్రయూనిట్ పేర్కొంది. ఇప్పుడు ఆ డేట్ కూడా మారినట్లు సమాచారం. 

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని జూన్‌ నెలలో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన లేకపోయినా వాయిదా పడిన విషయం మాత్రం ఖాయమని సినీ వర్గాల టాక్. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సరసన అరవింద సమేత సినిమాతో తాజాగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బ్యూటీ పూజా హెగ్డే  కథానాయికగా నటిస్తుంది.

సినిమా విడుదల లేట్ అవడానికి ప్రధాన కారణం డైరెక్టర్ వంశీ పైడిపల్లి అని చెబుతున్నారు. క్వాలిటీ అవుట్ పుట్ కోసం కొంచెం ఎక్కువ సమాయాన్ని వంశీ పైడిపల్లి తీసుకుంటున్నారట. ఏది ఏమైనా వేసవిలో తమ హీరో సినిమా వస్తుందని భావించిన మహష్ అభిమానులకు మాత్రం ఇది బ్యాడ్ న్యూసే.