Samantha : సమంతకు యంగ్ హీరో కావాలంట!

సమంత కమిట్ అయిన కొత్త సినిమాలో ఆమె పక్కన నటించడానికి హీరో కోసం వెతుకుతున్నారు మేకర్స్..

Samantha : సమంతకు యంగ్ హీరో కావాలంట!

Samantha

Updated On : October 18, 2021 / 7:24 PM IST

Samantha: ఇటీవలే మ్యారీడ్ లైఫ్‌కి ఎండ్ కార్డ్ వేసేసిన సమంత ప్రస్తుతం కెరీర్ మీద ఫోకస్ పెట్టింది. గుణ శేఖర్ దర్శకత్వంలో చేస్తున్న హిస్టారికల్ మూవీ ‘శాకుంతలం’ కంప్లీట్ అయిపోయింది. విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి నటిస్తున్న తమిళ్ మూవీ ‘కాతు వాకుల రెండు కాదల్’ పూర్తి కావొచ్చింది.

Naga Chaitanya : క్రేజీ కాంబినేషన్..

దసరా సందర్భంగా సమంత నటించబోయే రెండు కొత్త సినిమాలు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. వాటిలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తెలుగు, తమిళ్‌లో నిర్మించనున్న ద్విభాషా చిత్రం ఒకటి. ఓరియంటెడ్ సినిమా ఇది. హరి అండ్ హరీష్ దర్శకత్వంలో.. సీనియర్ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమా ప్రకటించారు.

Most Eligible Bachelor : అఖిల్ కోసం అల్లు అర్జున్

నవంబర్ నుండి షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమాలో సమంత పక్కన ఓ యంగ్ హీరో క్యారెక్టర్ ఉందంట. ఆ క్యారెక్టర్ కోసం ఎవరైతే బాగుంటారు.. సమంత పక్కన కాబట్టి కాస్త పరిచయం ఉన్న యాక్టర్‌ని పెడితేనే బాగుంటుందని ఆ యంగ్ హీరోని వెతికే పనిలో పడ్డారు మేకర్స్.

Unstoppable with NBK : షో లోనూ ‘సింహా’న్ని చూస్తారు..