Malavika Mohanan: వింటేజ్ లుక్‌లో నిద్ర లేకుండా చేస్తున్న మాళవిక!

అప్పుడెప్పుడో ఓ సినీ కవి పొగిడినట్లుగా ఏమెట్టి చేసాడే నిను ఆ బ్రహ్మ అన్నట్లు మాళవికా మోహనన్ ను చూస్తే కవితలు గోదారి పొంగినట్లుగా తన్నుకొచ్చేస్తాయేమో అనిపిస్తుంది. అందానికి అనువైన..

Malavika Mohanan: వింటేజ్ లుక్‌లో నిద్ర లేకుండా చేస్తున్న మాళవిక!

Malavika Mohanan (Image:Instagram)

Updated On : November 7, 2021 / 5:49 PM IST

Malavika Mohanan: అప్పుడెప్పుడో ఓ సినీ కవి పొగిడినట్లుగా ఏమెట్టి చేసాడే నిను ఆ బ్రహ్మ అన్నట్లు మాళవికా మోహనన్ ను చూస్తే కవితలు గోదారి పొంగినట్లుగా తన్నుకొచ్చేస్తాయేమో అనిపిస్తుంది. అందానికి అనువైన కొలతలు.. సమ్మోహనమైన సొగసు.. అంతకు మించి నిగనిగలాడే నునుపైన మేని ఛాయ. బహుశా ఆ బ్రహ్మ కూడా శ్రద్దగా చెక్కిన శిల్పంలా ఉంటుంది మాళవిక. అందుకే మాళవికా ట్రెండీ అయినా, ట్రెడిషనల్ అయినా.. ఫోజిస్తే ఫ్యూజ్ లు ఎగిరి పోవాల్సిందే.

Malavika Mohanan: ఒంపు సొంపులతో ముచ్చెమటలు పట్టించే మాళవిక!

మాళవికా మోహనన్ అంటే తెలుగులో ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా చేయలేదు కాబట్టి మనవాళ్ళకి తెలియదేమో అనుకుంటారు. కానీ మన కుర్రాళ్లలో ఆమెకున్న ఫాలోయింగే స్టార్ హీరోయిన్స్ కు కూడా ఉండదేమో. హాట్ హాట్ ఫొటో షూట్లతోనే సోషల్ మీడియాలో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించిన మాళవికకి సౌత్‌లో సెక్సీ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఎప్పటికప్పుడు ఫొటో షూట్లతో కనిపిస్తూ.. మైమరిపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేని రాత్రులు మిగిలుస్తూ ఉంది. మాళవికా చేసే ఫోటోషూట్లలో ఓ ప్రత్యేకత ఉంటుంది.

Malavika Mohanan: కెమెరా ముందు మాళవికా అందాల వడ్డన!

ఒక్కోసారి ఒక్కో థీమ్‌తో మాళవికా ఫొటో షూట్లు చేస్తూ ఎప్పటికప్పుడు తన ఫాలోవర్లకు ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. తాజాగా.. వారియర్ ప్రిన్సెస్ అవతారంలోకి మారిన మాళవికా.. రాజుల కాలం నాటి వింటేజ్ గెటప్ లో శృంగార దేవతలా దర్శనమిచ్చింది. ఇక, మాళవికా సినిమాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రాఫర్ కె యూ మోహనన్ కూతురైన మాళవిక మలయాళ పరిశ్రమ ద్వారా ఎంట్రీ ఇచ్చి మాస్టర్ సినిమాతో విజయ్ లాంటి స్టార్ హీరోకు జతయింది. ధనుష్ సరసన ‘మారన్’లో నటిస్తున్న మాళవిక.. ‘యుద్ర’ అనే సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతోంది.