Subi Suresh : సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ లేడీ కమెడియన్ మృతి..

సినీ పరిశ్రమలో వరుస మరణాలు తీరని శోకాన్ని మిగిలుస్తున్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రముఖులు స్వర్గస్తులు అవుతూ పరిశ్రమని శోకసంద్రంలోకి నెట్టేస్తున్నారు. ఇటీవలే తెలుగులో నందమూరి తారకరత్న మరణించగా, తమిళంలో ప్రముఖ స్టార్ కమెడియన్ 'మయిల్ సామి', కన్నడ చిత్ర సీమలో అగ్ర దర్శకుడు ఎస్ కె భగవాన్ కన్నుమూశారు. తాజాగా

Subi Suresh : సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ లేడీ కమెడియన్ మృతి..

Subi Suresh

Updated On : February 22, 2023 / 3:34 PM IST

Subi Suresh : సినీ పరిశ్రమలో వరుస మరణాలు తీరని శోకాన్ని మిగిలుస్తున్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రముఖులు స్వర్గస్తులు అవుతూ పరిశ్రమని శోకసంద్రంలోకి నెట్టేస్తున్నారు. ఇటీవలే తెలుగులో నందమూరి తారకరత్న మరణించగా, తమిళంలో ప్రముఖ స్టార్ కమెడియన్ ‘మయిల్ సామి’, కన్నడ చిత్ర సీమలో అగ్ర దర్శకుడు ఎస్ కె భగవాన్ కన్నుమూశారు. తాజాగా మలయాళ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ లేడీ కమెడియన్ మరియు టెలివిజన్ హోస్ట్ ‘సుబీ సురేష్’ మరణించారు.

Mayil Samy : పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి..

ఆమె మరణంతో మలయాళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుబీ సురేష్ గత కొంత కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతుండగా, చికిత్స పొందుతూ వస్తున్నారు. కొచ్చి అలువాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమె ఫిబ్రవరి 22‌ న తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 42 సంవత్సరాలు. సుబీ సురేష్ మరణ వార్త తెలియడంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు.

S K Bhagavan : చిత్రసీమలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి..

కాగా ఆమె సహా నటుడు రమేష్ పిషారోడి మీడియాతో మాట్లాడుతూ.. ‘గత 15 రోజులుగా సుబీ సురేష్ ఆరోగ్యం బాగోలేదని. మేము డోనార్ కోసం ప్రయత్నించాము, కానీ అది జరగలేదు. హాస్య రంగంలో ఆమె ఒక ఒంటరి మహిళా యోధురాలు. తన కుటుంబం కోసం 20 సంవత్సరాలు పాటు ఎంతో కష్టపడింది’ అంటూ తన ఆవేదని తెలియజేశాడు. మిమిక్రీ కళాకారిణిగా కెరీర్ మొదలు పెట్టిన సుబీ సురేష్.. టీవీ యాంకర్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది.