ఇది మీ సినిమా- మమ్ముట్టి స్పీచ్
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చాలా చక్కగా మాట్లాడి అందరి మనసులూ దోచుకున్నాడు మమ్ముట్టి.

యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చాలా చక్కగా మాట్లాడి అందరి మనసులూ దోచుకున్నాడు మమ్ముట్టి.
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సంఘటనలు హైలెట్‌గా రూపొందుతున్న సినిమా యాత్ర.. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. స్వాతికిరణం తర్వాత మమ్ముట్టి చేస్తున్న తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. దళపతి సినిమాతోనూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మమ్ముట్టి, యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చాలా చక్కగా మాట్లాడాడు.. మైక్ పట్టుకోగానే, నార్త్ హీరోయిన్స్ తరహాలోనే.. అందరికీ నమస్కారం అనగానే, అభిమానులు గట్టిగా అరిచారు. నేను తెలుగు మాట్లాడలేను, ఐ యామ్ సారీ, బట్ ఐ కెన్ అండర్‌స్టాండ్ తెలుగు, గివ్ మి సమ్‌మోర్ టైమ్ టు స్పీక్ బ్యూటిఫుల్ తెలుగు, టు కన్విన్స్ యూ, దట్ ఐ కెన్ స్పీక్ అంటూ.. ప్రారంభించిన మమ్ముట్టి, అందరి మనసులూ దోచుకున్నాడు.
సినిమాలో తన క్యారెక్టర్‌కి తనే డబ్బింగ్ చెప్పుకున్నాడు మమ్ముట్టి. ఇన్నాళ్ళూ తెలుగు సినిమా చెయ్యకపోవడానికి మంచి క్యారెక్టర్స్ రాకపోవడమే కారణం అన్న మమ్ముట్టి, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి స్ర్కిప్ట్ నచ్చడంతోనే ఒప్పుకున్నాను. ఇధి నా మూడవ తెలుగు సినిమా.. మా ప్రయత్నం మేము చేసాం.. ఇకనుండి ఇధి మీ సినిమా, మీరే దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మంచి క్యారెక్టర్స్ వస్తే తెలుగులోనూ నటిస్తాను అని చెప్పాడు మమ్ముట్టి.. చివర్లో ఆడియన్స్.. నాకు వినపడుతుందయ్యా డైలాగ్ చెప్పమని అడగ్గా, నాకు వినపడుతుందయ్యా, నేనువిన్నాను, నేను ఉన్నాను అనే డైలాగ్ చెప్పాడు మమ్ముట్టి.. ఫిబ్రవరి 8న యాత్ర గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
వాచ్ వీడియో…