Mana ShankaraVararasad garu Trailer: మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మన శంకరవరప్రసాద్ గారు ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా ట్రైలర్(Mana ShankaraVararasad garu Trailer) రిలీజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Mana ShankaraVararasad garu Trailer: మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మన శంకరవరప్రసాద్ గారు ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది

Mana Shankar Varaprasad garu movie trailer update.

Updated On : January 2, 2026 / 3:29 PM IST
  • మన శంకరవరప్రసాద్ గారు మూవీ రిలీజ్ కి రెడీ
  • ప్రమోషన్స్ షురూ చేసిన టీం
  • ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

Mana ShankaraVararasad garu Trailer: మెగాస్టార్ చిరంజీవి, నయనతార కాంబోలో వస్తున్న కొత్త సినిమా మన శంకరవరప్రసాద్ గారు. కామెడీ అండ్ ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు అనిల్ రవిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక మెగాస్టార్ కూడా చాలా కాలం తరువాత ఫ్యామిలీ సినిమా చేస్తుండటంతో అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ కి ఆడియన్స్ క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.

Vijay Deverakonda: విజయ్ బ్యాడ్ లక్.. కెరీర్ పీక్ స్టేజిలో నాలుగు సినిమాలు క్యాన్సిల్!

దీంతో, సినిమా విడుదల కోసం మెగా అభిమానులే కాదు నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ రిలీస్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మన శంకరవరప్రసాద్ గారు(Mana ShankaraVararasad garu Trailer) సినిమా ట్రైలర్ ను జనవరి 4న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో మెగాస్టార్ షార్ట్ గన్ పట్టుకొని ఒక రేంజ్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.