Vijay Deverakonda: విజయ్ బ్యాడ్ లక్.. కెరీర్ పీక్ స్టేజిలో నాలుగు సినిమాలు క్యాన్సిల్!
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా చేయాల్సిన నాలుగు సినిమాలు ఆగిపోయాయి. లిస్టులో స్టార్ డైరెక్టర్ మూవీస్ కూడా ఉన్నాయి.
Vijay Deverakonda four films cancelled as hero
- స్టార్ డైరెక్టర్స్ తో విజయ్ నాలుగు సినిమాలు
- అనుకోని కారణాల వల్ల క్యాన్సిల్
- రీసెంట్ గా కింగ్డమ్ 2 కూడా
Vijay Deverakonda: అర్జున్ రెడ్డి సినిమాతో నేషనల్ వైడ్ ఒక రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఆ తరువాత వచ్చిన గీత గోవిందం సినిమాతో ఆ క్రేజ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాడు. దాంతో, బాలీవుడ్ స్టార్స్ సైతం ఈ హీరోతో సినిమాలు చేసేందుకు చాలా ట్రై చేశారు. అంతేకాదు, బాలీవుడ్ బ్యూటీలకు సైతం మనోడు క్రష్ గా మారిపోయాడు.
కానీ, ఆ తరువాత ఎం జరిగిందో తెలియదు. వరుసగా ప్లాప్ సినిమాలు చేస్తూ రేస్ లో వెనుకబడిపోయాడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). గీత గోవిందం తరువాత ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు విజయ్. అయితే, హిట్స్ లేకపోవడం వేరు కానీ ఈ ప్లాప్స్ వల్ల విజయ్ చేయాల్సిన నాలుగు సినిమాలు ఆగిపోయాయి. ఆ సినిమాలు గనక విజయ్ చేసుంటే ఇప్పుడు అతని స్థానం ఒక రేంజ్ లో ఉండేది.
ఆ లిస్టులో మొదటగా వచ్చే సినిమా ‘హీరో’. గీత గోవిందం సినిమా తరువాత ఒక స్టార్ డైరెక్టర్ విజయ్ కోసం హీరో అనే అదిరిపోయే కథను రెడీ చేశాడట. కథ అంతా సిద్ధం అయ్యింది ఇక షూటింగ్ వెళ్లడమే ఆలస్యం అనుకునే టైంలో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. అలా మొదటి ఛాన్స్ మిస్ అయ్యాడు విజయ్.
విజయ్ దర్శకుడు పూరి జగన్నాధ్ తో లైగర్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కంటే ముందే పూరి జగన్నాధ్ తో మరోసారి ‘జన గణ మన’ అనే మరో పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేశాడు విజయ్. కానీ, లైగర్ ప్లాప్ వల్ల జనగణమన సినిమా ఆగిపోయింది. ఇది పూరి జగన్నాధ్ కి డ్రీం ప్రాజెక్టు అవడం విశేషం.
పుష్ప తరువాత సుకుమార్ విజయ్ తో ఒక సినిమా ప్లాన్ చేశాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ, అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఇక రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్ సినిమాకు సీక్వెల్ కూడా రావాల్సి ఉంది. కానీ, రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత నాగ వంశీ ఇక కింగ్డమ్ 2 ఉండదని చెప్పుకొచ్చాడు. ఇలా తన కెరీర్ లో నాలుగు పెద్ద సినిమాలను మిస్ చేసుకున్నాడు విజయ్.
