Suhani Kalita : పెళ్లిపీటలు ఎక్కిన మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ సుహాని..

మనసంతా నువ్వే సినిమాలో ‘తూనీగా తూనీగా.. ఎందాక పరిగెడతావే రావే నా వంకా..’ అనే పాటతో బాగా గుర్తుండిపోయిన క్యారెక్టర్ లో నటించిన అమ్మాయి సుహాని కలిత. బాల రామాయణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన సుహాని........

Suhani Kalita : పెళ్లిపీటలు ఎక్కిన మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ సుహాని..

manasantha nuvve child artist Suhani Kalita married vibhar haseeja

Updated On : September 7, 2022 / 7:17 AM IST

Suhani Kalita :  మనసంతా నువ్వే సినిమాలో ‘తూనీగా తూనీగా.. ఎందాక పరిగెడతావే రావే నా వంకా..’ అనే పాటతో బాగా గుర్తుండిపోయిన క్యారెక్టర్ లో నటించిన అమ్మాయి సుహాని కలిత. బాల రామాయణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన సుహాని.. గణేష్‌, ప్రేమంటే ఇదేరా, మనసంతా నువ్వే, ఎలా చెప్పను.. లాంటి పలు సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో కూడా సినిమాలు చేసింది. సినిమాలతో పాటు పలు కంపెనీల యాడ్స్‌లోనూ నటించింది.

2008లో సవాల్‌ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సుహాని. అయితే హీరోయిన్ గా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సుహాని ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటుంది.

BiggBoss 6 Day 2 : రెండో రోజే డైరెక్ట్‌గా ముగ్గురు నామిషన్స్‌లోకి.. హడావిడి చేసిన గీతూ.. ఓవర్ యాక్షన్ అంటున్న నెటిజన్లు..

ఇటీవల కొన్ని నెలల క్రితం సంగీతకారుడు, మోటివేషనల్‌ స్పీకర్‌ విభర్‌ హసీజాతో సుహాని కలిత నిశితార్థం జరగగా తాజాగా వీరి పెళ్లి జరిగింది. సుహాని, విభర్ పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగినట్టు తెలుస్తుంది. ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా పలువురు ప్రముఖులు, నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.