Manchu family : మోహన్ బాబు ఇంటి వద్ద హైటెన్షన్.. గేటు తోసుకుని లోపలికి వెళ్లిన మనోజ్..
మంచు ఫ్యామిలీ వివాదం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది

Manchu Family High Tension At Mohan Babu House bouncers stop manojs vehicle
మంచు ఫ్యామిలీ వివాదం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. కుటుంబంలో తలెత్తిన వివాదాల విషయమై మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక తెలంగాణ అదనపు డీజీపీ మహేష్ భగవత్‌ను మంగళవారం సాయంత్రం కలిశారు. తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరారు.
అనంతరం వారు జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి రాకుండా అడ్డుకున్నారు. మనోజ్ కారును గేటు వద్దే ఆపేశారు. దీంతో కారు నుంచి బయటకు దిగి మనోజ్ ఆగ్రహంతో ఊగిపోయారు.
Robinhood : నితిన్ రాబిన్ హుడ్ సెకండ్ సింగిల్ ‘అది దా సర్‌ప్రైజు’.. అప్‌డేట్..
తన కూతురుకి ఎమైనా జరిగితే ఊరుకునేది లేదు అంటూ ఆగ్రహంతో తోసుకుంటూ లోపలికి వెళ్లారు. ప్రస్తుతం అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది.