Robinhood : నితిన్ రాబిన్ హుడ్ సెకండ్ సింగిల్‌ ‘అది దా సర్‌ప్రైజు’.. అప్‌డేట్‌..

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న మూవీ రాబిన్ హుడ్‌.

Robinhood : నితిన్ రాబిన్ హుడ్ సెకండ్ సింగిల్‌ ‘అది దా సర్‌ప్రైజు’.. అప్‌డేట్‌..

Due to technical issues Robinhood Second Single released postpone

Updated On : December 10, 2024 / 6:19 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న మూవీ ‘రాబిన్ హుడ్‌’. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో శ్రీలీల క‌థానాయిక‌. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 25న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లు పెట్టింది.

వ‌రుస‌గా అప్‌డేట్‌లు ఇస్తూ వ‌స్తోంది. ‘వ‌న్ మోర్ టైమ్’ అంటూ ఓ పాట‌ను విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇక రెండో పాట ‘అది దా సర్‌ప్రైజు’ ను నేడు (డిసెంబ‌ర్ 10)న సాయంత్రం 5.04 గంట‌ల విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఇప్ప‌టికే ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

Pushpa 2 Collections : బాక్సాఫీస్ వ‌ద్ద ‘పుష్ప 2’ జోరు.. 900 కోట్ల క్ల‌బ్‌లో పుష్ప రాజ్‌.. వెయ్యి కోట్ల‌కు ఇంకెంత దూరమంటే?

ఇది ఓ ఐట‌మ్ సాంగ్ అని, ఇందులో కేతిక శ‌ర్మ చిందులేసిన‌ట్లుగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్ బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. పోస్ట‌ర్‌లో గ్లామరస్ లుక్ లో కేతిక క‌నిపించింది. రెడ్ క‌ల‌ర్ స్క‌ర్ట్ ధ‌రించింది. టాప్ స్థానంలో మ‌ల్లెపూల‌తో క‌వ‌ర్ చేసి న‌డుమును చూపిస్తూ యువ‌త‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది.

దీంతో ఈ పాట కోసం చాలా మంది ఎంతో ఆతృత‌గా వెయిట్ చేశారు. అయితే.. వారికి నిరాశే ఎదురైంది. టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్ వ‌ల్ల రెండో పాట ‘అది దా సర్‌ప్రైజు’ చెప్పిన స‌మ‌యానికి విడుద‌ల చేయ‌టం లేద‌ని తెలిపింది. త్వ‌ర‌లోనే ఈ పాట‌ను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం వెల్ల‌డించింది.

Ram Charan : రామ్‌చ‌ర‌ణ్ షేర్ చేసిన ‘గేమ్ ఛేంజ‌ర్’ వీడియో చూశారా?