Ram Charan : రామ్‌చ‌ర‌ణ్ షేర్ చేసిన ‘గేమ్ ఛేంజ‌ర్’ వీడియో చూశారా?

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న మూవీ గేమ్ ఛేంజ‌ర్‌.

Ram Charan : రామ్‌చ‌ర‌ణ్ షేర్ చేసిన ‘గేమ్ ఛేంజ‌ర్’ వీడియో చూశారా?

Ram Charan shares Game Changer shoot video

Updated On : December 10, 2024 / 4:10 PM IST

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10 న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌, పాట‌లకు మంచి స్పంద‌న వ‌చ్చింది. కాగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియోను హీరో రామ్ చ‌ర‌ణ్ అభిమానుల‌తో పంచుకున్నారు.

Aha OTT : చిరంజీవ.. ఆహాలో మరో సరికొత్త సిరీస్..ఎప్పటి నుండి అంటే..

గేమ్ ఛేంజ‌ర్ షూటింగ్ రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. చిత్రబృందంతో షూటింగ్‌లో పాల్గొన్న క్షణాలను వీడియో రూపంలో షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

ఈ చిత్రంలో అంజ‌లి, న‌వీన్ చంద్ర‌, సునీల్, శ్రీకాంత్‌, ఎస్‌జే సూర్య లు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త‌మ‌న్ సంగీతాన్ని అందించిన‌ ఈ చిత్రానికి తమిళ స్టార్‌ డైరెక్టర్‌ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు.

Thangalaan OTT Streaming : సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తంగలాన్.. ఎక్కడ చూడొచ్చంటే..