Aha OTT : చిరంజీవ.. ఆహాలో మరో సరికొత్త సిరీస్..ఎప్పటి నుండి అంటే..
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో సరికొత్త టాలెంట్ ను పరిచయం చేస్తుంటుంది.

aha OTT unveils new Mythological Series Chiranjeeva
Aha OTT : ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో సరికొత్త టాలెంట్ ను పరిచయం చేస్తుంటుంది. సరికొత్త స్టోరీస్ తో సరికొత్త నటీ నటులను పరిచయం చేస్తుంటారు. ఇప్పటికే ఆహా ప్రముఖ ఓటీటీలో ఎన్నో అద్భుతమైన వెబ్ సిరీస్, సినిమాలు వచ్చాయి. అందులో భాగంగానే ఓ సరికొత్త సిరీస్ ప్రకటిందింది ఆహా. తాజాగా చిరంజీవ ఓటీటీ వెబ్ సిరీస్ గురించి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఒక సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.
Also Read : Thangalaan OTT Streaming : సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తంగలాన్.. ఎక్కడ చూడొచ్చంటే..
చిరంజీవ టైటిల్ తో “యముడి తో ఆట” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో, ఈ సిరీస్ జనవరి 2025లో స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు.అభినయ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సిరీస్ అన్ని వయసుల ప్రేక్షకులను ఆకర్షించేలా, అద్భుతమైన కథనంతో ఉత్కంఠభరితంగా ఉంటుందని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ ను ఎ. రాహుల్ యాదవ్, సుహాసిని రాహుల్ సంయుక్తంగా నిర్మించారు.
View this post on Instagram
ఇక ఇందులో నటిస్తున్న నటీ నటులకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే వస్తాయన్నారు. మరిన్ని అప్డేట్స్ త్వరలోనే వస్తాయని తెలిపారు ఆహా టీమ్. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.