Pushpa 2 Collections : బాక్సాఫీస్ వ‌ద్ద ‘పుష్ప 2’ జోరు.. 900 కోట్ల క్ల‌బ్‌లో పుష్ప రాజ్‌.. వెయ్యి కోట్ల‌కు ఇంకెంత దూరమంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది.

Pushpa 2 Collections : బాక్సాఫీస్ వ‌ద్ద ‘పుష్ప 2’ జోరు.. 900 కోట్ల క్ల‌బ్‌లో పుష్ప రాజ్‌.. వెయ్యి కోట్ల‌కు ఇంకెంత దూరమంటే?

Allu Arjun Pushpa 2 five Days Collections

Updated On : December 10, 2024 / 5:47 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మూవీ డిసెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విడుద‌లైన ఐదు రోజుల్లోనే ఈ మూవీ 922 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది.

కాగా.. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత వేగంగా 900 కోట్ల క్ల‌బ్‌లో చేరిన తొలి సినిమా పుష్ప‌2 రికార్డు నెల‌కొల్పిన‌ట్లు వెల్ల‌డించింది. దీంతో బ‌న్నీ అభిమానులు తెగ ఆనందం వ్య‌క్తం చేశారు. పుష్ప 2 జోరు చూస్తుంటే ఒక‌టి లేదా రెండు రోజుల్లోనే ఈ చిత్రం ఈజీగా వెయ్యి కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టే అవ‌కాశాలు ఉన్నాయి.

Ram Charan : రామ్‌చ‌ర‌ణ్ షేర్ చేసిన ‘గేమ్ ఛేంజ‌ర్’ వీడియో చూశారా?

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీలో రష్మిక మందన్న క‌థానాయిక‌గా న‌టించింది. అన‌సూయ‌, ఫ‌హాద్ ఫాజిల్‌, సునీల్ లు కీల‌క పాత్ర‌లో న‌టించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్ లు నిర్మించారు.

Manchu Family : మంచు ఫ్యామిలీ వార్.. అసలు నిజాలు బయటపెట్టిన పని మనిషి..