Aadiparvam : ‘ఆదిపర్వం’ మూవీ రివ్యూ.. మంచు లక్ష్మి యాక్షన్ అదరగొట్టిందిగా..
రాయలసీమ కడప దగ్గర్లోని ఎర్రగుడి నేపథ్యంలో 1970-90 మధ్య కాలంలో జరిగిన కొన్ని కథల ఆధారంగా పీరియాడిక్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

Manchu Lakshmi Aadiparvam Movie Review and Rating
Aadiparvam Movie Review : మంచు లక్ష్మి, ఎస్తేర్ నోరాన్హా, శివ కంఠమనేని, ఆదిత్య ఓం మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘ఆదిపర్వం’. అన్వికా ఆర్ట్స్, ఏఐ(అమెరికా ఇండియా) ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో సంజీవ్ మేగోటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆదిపర్వం సినిమా నేడు నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీజిత ఘోష్, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, ఢిల్లీ రాజేశ్వరి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.
కథ విషయానికొస్తే.. రాయలసీమ కడప దగ్గర్లోని ఎర్రగుడి నేపథ్యంలో 1970-90 మధ్య కాలంలో జరిగిన కొన్ని కథల ఆధారంగా పీరియాడిక్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. కడప గుడిలో ఉండే ఎర్రగుడిలో గుప్త నిధులు ఉన్నాయని వాటిని దక్కించుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తుంటారు. ఎమ్మెల్యే నాగమ్మ(మంచులక్ష్మి) క్షుద్ర శక్తులతో కలిసి ఆ గుప్త నిధుల కోసం ప్రయత్నిస్తుంటుంది. మరో వైపు ఆ ఊరి పెద్ద రాయప్ప కూడా గుప్త నిధి కోసం ప్రయత్నిస్తాడు. కాని ఆ గుడికి ఉండే క్షేత్ర పాలకుడు(శివ కంఠంనేని) ఆ గుడిని కాపాడుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆ ఊళ్ళో ఉండే బుజ్జమ్మ – శ్రీను ప్రేమించుకుంటారు. కాని శ్రీను వేరే కులం అని బుజ్జమ్మ కుటుంబం ఏం చేసింది? గుప్తనిధి నిజంగానే ఉందా? దాని కోసం జరిగిన అరాచకాలు ఏంటి? ఎర్రగుడి ప్రాముఖ్యత ఏంటి? ప్రేమ కథకు, గుడికి సంబంధం ఏంటి? బుజ్జమ్మ – శ్రీను ప్రేమ ఫలించిందా? అమ్మవారు ఎందుకు రావాల్సి వస్తుంది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Dhoom Dhaam : ‘ధూం ధాం’ మూవీ రివ్యూ.. ఫుల్ గా నవ్వుకోవాల్సిందే..
సినిమా విశ్లేషణ.. గతంలో అమ్మోరు.. లాంటి దేవతలు వచ్చే సినిమాలు చాలా వచ్చేవి. ఈ ఆదిపర్వం కూడా అదే తరహాలోనిది. గతంలో విగ్రహాలను దొంగిలించే కథకు కొంత ఫిక్షన్ జోడించి ఆసక్తిగా తెరకెక్కించారు. ఓ గుడిలో గుప్త నిధులు ఉన్నాయి, వాటిని సొంతం చేసుకోవాలని కొంతమంది చేసే అరాచకాల నేపథ్యంలో పీరియాడిక్ గా ఆదిపర్వం సినిమాను తెరకెక్కించారు. రాయలసీమ ప్రాంతం, ఆ సంసృతిని బాగానే చూపించారు. ఆలయాల ప్రాముఖ్యం, ఆధ్యాత్మికత గురించి బాగా చెప్పారు. అమ్మోరు లాంటి సినిమాలో లాగా దేవతలు వచ్చే గ్రాఫిక్స్, యాక్షన్ సీక్వెన్స్ చాన్నాళ్లకు ఈ సినిమాలో చూపించారు. ప్రేమ కథ మాత్రం కొంత సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్.. ఈ సినిమాలో మంచు లక్ష్మి నెగిటివ్ రోల్ లో ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లతో నాగమ్మ పాత్రలో అదరగొట్టింది. ఆదిత్య ఓం హనుమంతు పాత్రలో అదరగొట్టాడు. శ్రీజిత ఘోష్ తన అందాలతో అలరిస్తుంది. ఎస్తేర్ నోరాన్హా, సుహాసిని, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, ఢిల్లీ రాజేశ్వరి.. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా ఇచ్చారు. పాటలు యావరేజ్. గ్రాఫిక్స్ బాగున్నాయి. దేవతల ఎలివేషన్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. సింపుల్ కథనంతో సంజీవ్ మేగోటి ఆదిపర్వం సినిమాను బాగానే తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది.
మొత్తంగా ఆదిపర్వం సినిమా ఓ గుడిలో గుప్తనిధుల కోసం జరిగే పోరాటం. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.