Manchu Lakshmi : పాన్ ఇండియా మూవీతో మంచు లక్ష్మీ.. పీరియాడిక్ సోషియో ఫాంటసీ ‘ఆదిపర్వం’..
పాన్ ఇండియా మూవీతో రాబోతున్న మంచు లక్ష్మీ. 'ఆదిపర్వం' లాంటి పీరియాడిక్ సోషియో ఫాంటసీతో..

Manchu Lakshmi Periodic Drama And Socio Fantasy AADIPARVAM
Manchu Lakshmi : మంచు లక్ష్మి గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నటిగా, యాంకర్‌గా, షో ప్రెజెంటర్‌గా, నిర్మాతగా.. తెలుగు ఆడియన్స్ ని తనదైన శైలిలో అలరించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ సమాజ సేవల్లో బిజీ అయిన మంచు లక్ష్మి.. మళ్ళీ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.
సంజీవ్ మేగోటి దర్శకత్వంలో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో ఓ పీరియాడిక్ సోషియో ఫాంటసీ డ్రామా మూవీ రాబోతుంది. 1974 నుంచి 1992 మధ్య కాలం నేపథ్యంతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి మంచి స్పందన రావడంతో నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తూ ఆడియన్స్ కి కృతజ్ఞతలు తెలియజేసారు.
Also read : Jithender Reddy : ఎలక్షన్స్ టైంలో పొలిటికల్ డ్రామాగా రాబోతున్న జితేందర్ రెడ్డి.. రియల్ లైఫ్ స్టోరీతో..
రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ సంయుక్త నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ మంచు లక్ష్మితో పాటు శివకంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారు.