Manchu Manoj : క్రేజీ సినిమాతో వస్తున్న మంచు మనోజ్.. వాట్ ది ఫిష్!

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన కొత్త సినిమాని ప్రకటించాడు. గత కొంత కాలంగా ఈ హీరో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. దీంతో మంచు మనోజ్ సినిమాలకి బ్రేక్ ఇచ్చేశాడు అంటూ వార్తలు వినిపించాయి. భూమా మౌనిక రెడ్డికి దగ్గర అవ్వడంతో మనోజ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ గుసగుసలు కూడా వినిపించాయి. అయితే ఆ వార్తలు అన్ని అవాస్తం అని తెలిపేలా ఈ హీరో తన కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు.

Manchu Manoj : క్రేజీ సినిమాతో వస్తున్న మంచు మనోజ్.. వాట్ ది ఫిష్!

Manchu Manoj

Updated On : January 20, 2023 / 10:28 AM IST

Manchu Manoj : టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన కొత్త సినిమాని ప్రకటించాడు. గత కొంత కాలంగా ఈ హీరో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. దీంతో మంచు మనోజ్ సినిమాలకి బ్రేక్ ఇచ్చేశాడు అంటూ వార్తలు వినిపించాయి. భూమా మౌనిక రెడ్డికి దగ్గర అవ్వడంతో మనోజ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ గుసగుసలు కూడా వినిపించాయి. అయితే ఆ వార్తలు అన్ని అవాస్తం అని తెలిపేలా ఈ హీరో తన కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు.

Manchu Manoj: జీవితంలో కొత్త దశలోకి అడుగుపెడుతున్నా.. మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

మంచు మనోజ్ చివరిగా ఒక్కడు మిగిలాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2017 లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకోలేక పోయింది. ఆ తరువాత రెండు సినిమాల్లో గెస్ట్ రోల్ లో కనిపించి అలరించాడు. అయితే మనోజ్ పూర్తీ స్థాయిలో హీరోగా కనిపించి దాదాపు 5 ఏళ్ళు అయ్యిపోతుంది. తాజాగా ఒక క్రేజీ టైటిల్ తో తన కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. ఈ చిత్రానికి ‘వాట్ ది ఫిష్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ టైటిల్ కి ‘మనం మనం బరంపురం’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో చుట్టూ గ్యాంగ్ స్టార్స్ ఉంటే మధ్యలో మంచు మనోజ్ నుంచి ఉన్న దృశ్యం కనిపిస్తుంది.

ఇక ఈ పోస్టర్ లో ‘ఏ ఫిలిం బై వి’ అని ఉంది. దర్శకుడు ఎవరనేది సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఏదేమైనా క్రేజీ టైటిల్ తో ఆడియన్స్ లో సినిమా పై బుజ్ కలిగేలా చేసుకున్నాడు మనోజ్. నిజానికి ఈ హీరో నుంచి అభిమానులు కోరుకునేది ఇలాంటి క్రేజీ సినిమాలే. కానీ మనోజ్ గత కొన్ని చిత్రాలు నుంచి అన్ని సీరియస్ మోడ్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తో వస్తున్నాడు. కాగా ఈ మూవీతో పాటు ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమా కూడా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని ఇటీవల ప్రకటించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.