మంచు ఘాటుగా : మోదీజీ.. మా మాటేమిటి

  • Published By: veegamteam ,Published On : February 2, 2019 / 03:57 AM IST
మంచు ఘాటుగా : మోదీజీ.. మా మాటేమిటి

Updated On : February 2, 2019 / 3:57 AM IST

హైదరాబాద్ : కేంద్ర  బడ్జెట్ తరువాత ప్రముఖుల నుండి పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ కుమార్ ప్రధాని నరేంద్రమోడీని ఉద్ధేశించి కాస్తంత ఘాటుగా స్పందించారు తన ట్విట్టర్ లో. ‘ప్రధాని నరేంద్రమోదీ జీ..ఏపీ విభజన సమయంలో మీరు ఇచ్చిన హామీల మాటేమిటీ? ఇన్ని రోజులు మీరు చేసిన ప్రతీ నిర్ణయంలోను..మీకు మద్దతు పలికామనీ..మీరు మాత్రం ఇచ్చిన హామీలను మరిచిపోయారనీ..నాలుగున్నరేళ్ల నుండి హామీలు నెరవేరుస్తారనే ఆశతో ఇంత కాలం వేచి చూశామనీ.. ప్రత్యేక హోదా కాదు కదా.. కనీసం ఒక్క ప్రకటన కూడా మీ నుంచి రాలేదు. 

మా డిమాండ్‌ను గౌరవించి, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వండి.. లేకపోతే ఏ సన్నిధిలోనైతే హోదా ప్రమాణం చేశారో.. ఆ లార్డ్ బాలాజీ ఆగ్రహానికి గురికాకతప్పదు..’’అంటు ట్విట్టర్ వేదికగా మోడీని హెచ్చరించారు. మంచు మనోజ్ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ప్రధాని మోదీని బాగా అడిగారు.. మీరు సూపర్ అంటూ ప్రశంసలు కురిపించారు. కొందరు రాజకీయ నేతల్లో కూడా మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. 

ఇప్పటకే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ,పశ్చిమ  బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం వంటి పలువురితో పాటు విభజన హామీల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ ప్రభుత్వం నల్ల దస్తులతో అసెంబ్లీకి వచ్చి తమ నిరసననుతెలిపారు. 2019 బడ్జెట్ ను ఎన్నికల తాయిలంలా ఉందని విమర్శించిన విషయం తెలిసిందే.