Kannappa Song : ‘కన్నప్ప’ నుంచి లవ్ సాంగ్ వచ్చేసింది.. మంచు విష్ణు, ప్రీతీ ముకుందన్ మధ్య రొమాంటిక్ సాంగ్..
తాజాగా ఈ సినిమాలోని లవ్ సాంగ్ ని రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ సాంగ్ ని వినేయండి..

Vishnu Manchu Preity Mukhundhan Kannappa Love song Released
Kannappa Song : మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమాని భారీగా దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మాణంలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, మధుబాల.. ఇలా చాలా మంది స్టార్స్ ఉన్నారు.
Also Read : Rashmika Mandanna : రష్మికకు బెదిరింపులు..? కొడవ కమ్యూనిటీ కౌన్సిల్ ఆరోపణలు.. సెక్యూరిటీ ఇవ్వాలి అంటూ..
ఇప్పటికే కన్నప్ప సినిమా నుంచి రెండు టీజర్లు, శివుడిపై ఒక సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమాలోని లవ్ సాంగ్ ని రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ సాంగ్ ని వినేయండి..
స్టీఫెన్ దేవస్సి సంగీత దర్శకత్వంలో శ్రీమణి రాసిన ఈ పాటని రేవంత్, సాహితీ పాడారు. మంచు విష్ణు, ప్రీతీ ముకుందన్ మధ్య రొమాంటిక్ గా ఈ సాంగ్ ని న్యూజిలాండ్ అడవుల్లో తెరకెక్కించారు. ఇక కన్నప్ప సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది.