Manchu Mohan Babu: బావా.. నీకు డజను మంది పిల్లలు పుట్టాలి.. ప్రభాస్ పై మోహన్ బాబు క్రేజీ పోస్ట్

గ్లోబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్బంగా హీరో మంచు విష్ణు క్రేజీ పోస్ట్ పెట్టాడు. ఆయనకు(Manchu Mohan Babu) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. బావా.. నీకు డజను మంది పిల్లలు పుట్టాలి అంటూ రాసుకొచ్చాడు.

Manchu Mohan Babu: బావా.. నీకు డజను మంది పిల్లలు పుట్టాలి.. ప్రభాస్ పై మోహన్ బాబు క్రేజీ పోస్ట్

Manchu Mohan babu wishes Prabhas a happy birthday on social media

Updated On : October 23, 2025 / 4:47 PM IST

Manchu Mohan Babu: గ్లోబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్బంగా హీరో మంచు మోహన్ బాబు క్రేజీ పోస్ట్ పెట్టాడు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. బావా.. నీకు డజను మంది పిల్లలు పుట్టాలి అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం మంచు మోహన్ బాబు చేసిన ఈ పోస్ట్ వైరల్ గా(Manchu Mohan Babu) మారింది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. దీపావళి పండుగ తరువాత వచ్చే ఈరోజు ప్రభాస్ ఫ్యాన్స్ కి మరో పండుగ రోజు అనే చెప్పాలి. అందుకే, దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ పలు సేవా కార్యక్రమాలను చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక చాలా మంది సినీ సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో ప్రభాస్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Ram Charan-Upasana: మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్-ఉపాసన.. మెగా ఫ్యామిలీలో సంబరాలు.. ఫోటోలు

ఇందులో భాగంగానే టాలీవుడ్ సీనియర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ప్రభాస్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశాడు. “మై డియర్ బావా ప్రభాస్.. ఈ జాతి మొత్తానికి నువ్వు సినీ గర్వకారణం. నీకు అంతులేని ఆనందం లభించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాము. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే, నీకు త్వరగా పెళ్లి అయ్యి, డజన్ మంది పిల్లలు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చారు. దీంతో మంచు మోహన్ బాబు ఫన్నీగా చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రభాస్, మంచు ఫ్యామిలీ మధ్య ఎంతటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచు మోహన్ బాబుకి ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఏఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎన్నిసార్లు చెప్పుకొచ్చాడు. ఇక ఇటీవల విడుదలైన కన్నప్ప సినిమాలో కూడా గెస్ట్ రోల్ లో కనిపించాడు ప్రభాస్. అది కూడా కేవలం మంచు మోహన్ బాబుపై ఉన్న గౌరవంతోనే. ఒక్క పైసా రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా ఆ పాత్ర చేశాడు ప్రభాస్. ఆ పాత్ర సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.