Voter Teaser:ఓటర్ టీజర్: ఎలక్షన్‌ను క్యాష్ చేసుకుంటున్నారా? 

సార్వత్రిక ఎన్నికలు వస్తున్న తరుణంలో రాజకీయ నాయకులే కాదు సినిమా వాళ్లు కూడా సీజన్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. పొలిటికల్ సినిమాలను విడుదల చేసి ఎన్నికల హీట్‌ను వాడుకునేందుకు ప్రయత్నిస

Voter Teaser:ఓటర్ టీజర్: ఎలక్షన్‌ను క్యాష్ చేసుకుంటున్నారా? 

Manchu Vishnus Voter Teaser

Updated On : January 4, 2022 / 11:14 AM IST

Voter Teaser:సార్వత్రిక ఎన్నికలు వస్తున్న తరుణంలో రాజకీయ నాయకులే కాదు సినిమా వాళ్లు కూడా సీజన్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. పొలిటికల్ సినిమాలను విడుదల చేసి ఎన్నికల హీట్‌ను వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే యాత్ర, మహానాయకుడు వంటి పొలిటికల్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు విడుదల అవగా.. త్వరలో లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా కూడా విడుదలకు సిద్ధం అవుతుంది. ఇవి ఇలా ఉంటే విష్ణు క‌థానాయ‌కుడిగా ‘ఓట‌ర్‌’ అనే సినిమా మొద‌లై, పూర్త‌ై విడుదల కాకుండా ల్యాబ్‌లో ఆగిపోయింది. రెండేళ్లుగా ఈసినిమా ల్యాబులోనే ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు.
Read Also: అలియా భ‌ట్ అర్ధ‌రాత్రి బ‌ర్త్‌డే వేడుకల‌ు

ఈ క్రమంలో ఓటర్ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘అహింస మార్గం ద్వారా ఒక్క బుల్లెట్‌ కూడా కాల్చకుండా స్వాతంత్రం తెచ్చుకున్న దేశం మనది. మనం పేదరికంపై పోరాటం చేశాం కానీ పేదలపై పోరాటం చేయలేదు. మార్పు మనలో రావాలి.. మారాలి.. మార్చాలి’ అంటూ సాగే డైలాగ్‌ టీజర్ ఆకట్టుకోగా.. నువ్వు ఆఫ్టర్‌ఆల్ ఒక ఓటర్ అని విలన్ చెప్పే డైలాగ్‌కు నేను ఆఫ్టర్‌ఆల్ ఓటర్ కాదు ఓనర్‌ను అంటూ విష్ణూ చెప్పే డైలాగ్ టీజర్‌లో ఉంది. పొలిటిక‌ల్ యాక్షన్ డ్రామాతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జీఎస్‌ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సురభి హీరోయిన్‌గా నటించింది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయబోతున్నారు.
Read Also: మ‌జిలి మూడో సాంగ్ ‘నా గుండెల్లో’ విడుదల