Manoj-Mounika : ఆళ్లగడ్డలో భూమా దంపతులకు నివాళులు అర్పించిన మనోజ్, మౌనిక..

గత కొంత కాలంగా రాయలసీమలో మంచు కుటుంబం, భూమా కుటుంబం ఒకటి కాబోతున్నారు అంటూ వినిపిస్తున్న గుసగుసలకు ముగింపు పడింది. ఆ వార్తలు అన్నిటిని నిజం చేస్తూ మంచు వారసుడు మనోజ్, ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనిక.. మార్చి 3 వివాహంతో ఒకటయ్యారు. కాగా నేడు...

Manoj-Mounika : ఆళ్లగడ్డలో భూమా దంపతులకు నివాళులు అర్పించిన మనోజ్, మౌనిక..

Manoj and Mounika

Updated On : March 5, 2023 / 2:56 PM IST

Manoj-Mounika : గత కొంత కాలంగా రాయలసీమలో మంచు కుటుంబం, భూమా కుటుంబం ఒకటి కాబోతున్నారు అంటూ వినిపిస్తున్న గుసగుసలకు ముగింపు పడింది. ఆ వార్తలు అన్నిటిని నిజం చేస్తూ మంచు వారసుడు మనోజ్, ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనిక.. మార్చి 3 వివాహంతో ఒకటయ్యారు. హైదరాబాద్ లోని మనోజ్ ఇంట్లోనే ఈ వివాహం జరిగింది. కేవలం ఇరువురి కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు.

Manoj-Mounika : భూమా దంపతులకు నివాళులు అర్పించనున్న మనోజ్, మౌనిక.. భారీ కాన్వాయ్‌తో ఆళ్లగడ్డకు పయనం..

కాగా నేడు మనోజ్ అత్తవారింటికి బయలుదేరాడు. భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుంచి ఆళ్లగడ్డకు మనోజ్, మౌనికని తీసుకోని ఈరోజు ఉదయం పయనమయ్యాడు. దారి మధ్యలో ప్రముఖ రాజకీయ నేత, మౌనిక బంధువు అయిన రామ సుబ్బారెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకొన్న కొత్త జంట.. అనంతరం ఆళ్లగడ్డ చేరుకొని మౌనిక రెడ్డి అమ్మానాన్నలు నాగిరెడ్డి, శోభ సమాధులకు నివాళులు అర్పించారు. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా కూడా వారితో పాటు భూమా దంపతులకు నివాళులు అర్పించింది.

అనంతరం ఆళ్లగడ్డలో భూమా వారింట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అభిమానులు, కార్యకర్తలతో మాట్లాడనున్నారు మనోజ్, మౌనిక. ఆళ్లగడ్డలో నేడు భూమా ఫ్యామిలీ అభిమానులకు, కార్యకర్తలకు భారీ విందు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. కాగా మనోజ్, మౌనికలకు ఇది రెండో వివాహం. గతంలో వీరిద్దరికి విడివిడిగా వివాహం జరుగగా, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకోని విడిపోయారు. విడాకులు తరువాత దగ్గరయిన మనోజ్, మౌనిక కొంతకాలంగా సహజీవనం చేస్తూ వచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు.