Manchu Manoj: ఆర్‌జీవీ ట్వీట్‌కి మంచు మనోజ్ పంచ్!
మంచు మనోజ్.. మా ఎన్నికల వేళ గొడవలు లేకుంగా సర్దిచెప్పడంలో కీలకంగా వ్యవహరించారు అంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి కూడా పలువురు వెల్లడించారు.

Rgv Punch
Manchu Manoj: మంచు మనోజ్.. మా ఎన్నికల వేళ గొడవలు లేకుంగా సర్దిచెప్పడంలో కీలకంగా వ్యవహరించారు అంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి కూడా పలువురు వెల్లడించారు. మంచు మనోజ్ లేకుంటే మా ఎన్నికల పోలింగ్ సమయంలో కొట్టుకుని ఉండేవారని, పరిస్థితి దారుణంగా తయారయ్యేదని కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్ చెప్పింది.
మంచు మనోజ్.. ఎప్పుడూ కూడా కాస్త సామరస్య వాతావరణం క్రియేట్ చెయ్యాలనే ఆలోచనతో ఉండేవారు. ఈ క్రమంలోనే మా ఎన్నికల టైమ్‌లో ప్రకాష్ రాజ్, విష్ణు కలిసిపోయారంటూ కూడా ట్వీట్ చేశారు.
లేటెస్ట్‌గా మా గొడవలపై రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్‌పై మంచు మనోజ్ రియాక్ట్ అయ్యారు. మా అసోసియేషన్ ఓ సర్కస్ అని, సభ్యులంతా జోకర్లు అంటూ చేసిన ట్వీట్‌పై.. సార్, మీరు రింగ్ మాస్టర్.. అంటూ పంచ్ వేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.
And you are the Ring Master sir ?? https://t.co/gW8VaFhwdb
— Manoj Manchu??❤️ (@HeroManoj1) October 19, 2021
View this post on Instagram