Marimuthu : మొన్న రమేష్.. ఇవాళ మరిముత్తు.. జైలర్ సినిమా విలన్ గ్యాంగ్ నిజంగానే మరణిస్తున్నారు..

జైలర్ సినిమాలో విలన్ గ్యాంగ్ లో ఉన్న మనుషులు ఇప్పుడు నిజంగానే చనిపోతున్నారు. రజినీకాంత్ జైలర్ సినిమాలో విలన్ పక్కనే ఉండే పాత్రలో నటించి మెప్పించాడు మరిముత్తు. ఇవాళ ఉదయం గుంటుపోటుతో మరిముత్తు 56 ఏళ్ళ వయసులో హఠాత్తుగా మరణించడంతో...

Marimuthu : మొన్న రమేష్.. ఇవాళ మరిముత్తు.. జైలర్ సినిమా విలన్ గ్యాంగ్ నిజంగానే మరణిస్తున్నారు..

Marimuthu and Ramesh who worked in Rajinikanth Jailer Movie as Villain side Characters passed away in months gap

Updated On : September 8, 2023 / 1:38 PM IST

Marimuthu – Ramesh : ఇటీవల ఆగస్టులో రజినీకాంత్(Rajinikanth) జైలర్(Jailer) సినిమాతో వచ్చి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో రజినీకాంత్ చాలా గ్యాప్ తర్వాత భారీ హిట్ కొత్త ఏకంగా 650 కోట్ల కలెక్షన్స్ వసూలు చేశారు. ఇక ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అందరికి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా విలన్ గ్యాంగ్ కి. జైలర్ సినిమాలో విలన్ గా వినాయకన్(Vinayakan) నటించాడు. కామెడీ చేస్తూ సీరియస్ గా ఉంటూ తన కొత్త విలనిజంతో మెప్పించాడు.

విలన్ గ్యాంగ్ లో ఉన్న మరికొంతమందికి కూడా గుర్తింపు వచ్చింది. విలన్ పాటలు పెడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. అతనితో పాటలు ఉన్న గ్యాంగ్ కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఈ డ్యాన్స్ లు బాగా పాపులర్ అవ్వడంతో విలన్ గ్యాంగ్ అంతా బాగా వైరల్ అయింది. సినిమాలో విలన్స్ అంటే చావాల్సిందే. జైలర్ సినిమాలో కూడా విలన్ గ్యాంగ్ చనిపోతారు.

కానీ జైలర్ సినిమాలో విలన్ గ్యాంగ్ లో ఉన్న మనుషులు ఇప్పుడు నిజంగానే చనిపోతున్నారు. రజినీకాంత్ జైలర్ సినిమాలో విలన్ పక్కనే ఉండే పాత్రలో నటించి మెప్పించాడు మరిముత్తు. ఇవాళ ఉదయం గుంటుపోటుతో మరిముత్తు 56 ఏళ్ళ వయసులో హఠాత్తుగా మరణించడంతో తమిళ పరిశ్రమలో విషాదం నెలకొంది. మరిముత్తు దాదాపు 25 ఏళ్లుగా తమిళ పరిశ్రమలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆయనకు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Marimuthu : వారం రోజుల క్రితమే వెడ్డింగ్ యానివర్సరీ.. ఇప్పుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి..

అయితే కొన్ని నెలల క్రితం కూడా జైలర్ సినిమా విలన్ గ్యాంగ్ లో విలన్ పక్కనే ఉండి డ్యాన్స్ లు చేసిన రమేష్ అనే డ్యాన్సర్, ఆర్టిస్ట్ కూడా మరణించాడు. సైడ్ డ్యాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టిన రమేష్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాలు చేశాడు. జైలర్ సినిమాలో విలన్ పక్కనే ఉండి డ్యాన్సుల్లో మెప్పించాడు. స్వతహాగా డ్యాన్సర్ కావడంతో ఈ డ్యాన్సులు వైరల్ అయి ఇతనికి కూడా మంచి పేరు వచ్చింది. కానీ కొన్ని నెలల క్రితం రమేష్ తన రూమ్ లో శవమై కనిపించడంతో తమిళనాట ఈ వార్త వైరల్ అయింది. జైలర్ సినిమా సక్సెస్, అతనికి వచ్చిన గుర్తింపు చూడకుండానే వెళ్లిపోయాడని పలువురు బాధని వ్యక్తం చేశారు.

ఇలా జైలర్ సినిమా విలన్ గ్యాంగ్ లో అప్పుడు రమేష్, ఇవాళ మరిముత్తు మరణించడంతో నిజంగానే విలన్ మనుషులు మరణిస్తున్నారేంటి అని హాట్ టాపిక్ గా మారింది.