VS Mukkhesh : వేడెవడ్రా బాబు.. పూరి జగన్నాద్ కంటే ఫాస్ట్‌గా ఉన్నాడు.. 24 రోజుల్లో సినిమా షూట్ కంప్లీట్..

పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న 'మార్కెట్ మహాలక్ష్మి' సినిమాతో VS ముఖేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో..

VS Mukkhesh : వేడెవడ్రా బాబు.. పూరి జగన్నాద్ కంటే ఫాస్ట్‌గా ఉన్నాడు.. 24 రోజుల్లో సినిమా షూట్ కంప్లీట్..

Market Mahalakshmi movie director VS Mukesh share interesting topics about film

VS Mukkhesh : పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా కొత్త దర్శకుడు VS ముఖేష్ దర్శకత్వంలో బి2పి స్టూడియోస్ బ్యానర్ పై అఖిలేష్ కలారు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘మార్కెట్ మహాలక్ష్మి’. ఓ సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకునే అబ్బాయి మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని ప్రేమించే కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మంచి బజ్ తెచ్చుకున్న మార్కెట్ మహాలక్ష్మి సినిమా ఏప్రిల్ 19న థియేటర్స్ లోకి రానుంది.

తాజాగా మార్కెట్ మహాలక్ష్మి డైరెక్టర్ VS ముఖేష్ మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ముఖేష్ దాదాపు 100కి పైగా షార్ట్ ఫిలిమ్స్ చేసి ఇప్పుడు దర్శకుడిగా మారాడు. సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకునే అబ్బాయి మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని ప్రేమించే కాన్సెప్ట్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయని ఓ పాయింట్ ని కూడా చూపించాం. ఓ మెసేజ్ కూడా ఉంటుంది ఈ సినిమాలో ఆ పాయింట్ చాలా సెన్సిటివ్. అందుకే ప్రమోషన్స్ లో ఎక్కడ చూపించట్లేదు అని తెలిపాడు.

Also read : Telugu – Tamil Movies : అటు తమిళ్.. ఇటు తెలుగు సూపర్ స్టార్స్.. 2024 సెకండ్ హాఫ్‌లో..

నాకు తెలిసిన ఓ సాఫ్ట్ వేర్ ఫ్రెండ్ ఇలాగే కూరగాయలు అమ్మే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇన్సిడెంట్ ని ఆధారంగా తీసుకొని కథ రాసుకున్నాను. నాకు, పార్వతీశంకు మధ్య మంచి స్నేహం ఉంది. అతను దీనికి కరెక్ట్ గా సెట్ అవుతాడనిపించింది. ఈ సినిమాని 6 పాటలు, ఫైట్, టాకీ పార్ట్ మొత్తం 24 రోజుల్లో షూట్ పూర్తిచేశాము. ఈ సినిమాతో నేనేంటో చూపించాలనుకొని పక్కా ప్లాన్ తో చేసాను అని తెలిపాడు ముఖేష్. 24 రోజుల్లో టాకీతో పాటు, పాటలు కూడా షూట్ చేసాడంటే పూరి జగన్నాధ్ కంటే ఫాస్ట్ గా ఉన్నట్టే.

ఇక మార్కెట్ మహాలక్ష్మి సినిమాకు ఓటీటీ ఆఫర్స్ వచ్చినా థియేటర్స్ లో రిలీజయ్యాకే ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకున్నాము. ఈ సినిమా కచ్చితంగా అందరికి నచ్చుతుంది. చిన్న హీరోల సినిమాలు, కొత్త వాళ్ళు వస్తే అంత తొందరగా ఎవరూ సినిమాలకు రారు. అదే మన ఫేవరేట్ హీరోల సినిమాలు, వాళ్ళ ఫ్యామిలీ హీరోల సినిమాలు అయినా సరే వెళ్లి చూస్తాము. కానీ చిన్న సినిమాలకు కూడా రండి. సినిమా బాగుంటే అందరికి చెప్పండి అని అన్నారు దర్శకుడు ముఖేష్.