Maro Prasthanam: ఇలాంటి కథ నిజ జీవితాల్లో జరగకూడదనుకుంటున్నా – తనీశ్

తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'మరో ప్రస్థానం'. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్..

Maro Prasthanam: ఇలాంటి కథ నిజ జీవితాల్లో జరగకూడదనుకుంటున్నా – తనీశ్

Tanish As Hero

Updated On : September 16, 2021 / 7:39 PM IST

Maro Prasthanam: తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘మరో ప్రస్థానం’. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ముస్కాన్ సేథీ నాయిక. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. రిలీజ్ కు రెడీ అయిన మరో ప్రస్థానం’ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల సిద్దమవుతోంది. రీసెంట్‌గా సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు.

‘మరో ప్రస్థానం సినిమా టెక్నికల్ గా కథ పరంగా చాలా స్ట్రాంగ్. చాలా మంది వన్ షార్ట్ ఫిలిం అంటే ఏంటి ఈ సినిమాకు అంత స్పెషల్ ఏంటి అంటారు. మరో ప్రస్థానం సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా డెడికేషన్ గా పనిచేశారు. ఈ సినిమాలో ఉన్నటువంటి సందర్భాలు బయట ఉండకూడదు అని కోరుకుంటున్నాను. మనం సినిమాలు సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకే మరో ప్రస్థానం సినిమాను సెప్టెంబర్ 24న థియేటర్లలోనే రిలీజ్ చేస్తున్నాం’ అని తనీశ్ అన్నారు.

ఎడిటర్ గా క్రాంతి పనిచేస్తుండగా మిర్త్ మీడియా నిర్మాణంలో జానీ కథను రచించి దర్శకత్వం వహిస్తున్నారు.