Tuck Jagadish
TuckJagadish: రంగుల ప్రపంచంలో వెండితెర మీద సినిమాలు బుల్లితెర మీదకే వచ్చేస్తున్నాయి. థియేటర్లలో రిలీజ్ అవ్వకుండా నేరుగా ఓటీటీల్లో వస్తున్న సినిమాల్లో న్యాచురల్ స్టార్ నానీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇటీవల నానీ హీరోగా నటించిన ‘V’ సినిమా థియేటర్లో కాకుండా ఓటీటీలోనే రాగా తన తర్వాతి సినిమా “టక్ జగదీష్” కూడా ఓటీటీల్లోనే రాబోయే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ఎన్నో వివాదాల తర్వాత టక్ జగదీష్ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. నిర్మాతలేమో ఓటీటీలో విడుదల చేస్తామని ప్రకటించారు. నానీ కూడా సపోర్ట్ చేస్తానని చెప్పినా కూడా.. మనస్పూర్తిగా ఒప్పుకున్నట్లుగా అనిపించట్లేదు. ఈక్రమంలోనే ఎగ్జిబిటర్స్ కూడా నానీపై ఆగ్రహం వ్యక్తం చేయడం.. వెంటనే మరో వర్గం నానీకి సారి చెప్పటం జరిగాక.. టక్ జగదీష్ డిజిటల్ రిలీజ్ నిర్ణయం పూర్తిగా నిర్మాతలదేనని కూడా ప్రకటించారు.
ఈ క్రమంలోనే ట్విట్టర్‌లో ‘టుమారో’ అంటూ ఏదో క్రేజీ అనౌన్స్‌మెంట్ కచ్చితంగా చెయ్యనున్నట్లుగా ముందే ప్రకటించారు. టక్ జగదీష్ చిత్రం శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కగా రీతూ వర్మ ఇందులో హీరోయిన్. షైన్ స్క్రీన్ సినిమాస్ సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావల్సి ఉండగా.. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా విడుదల అవ్వలేదు.
Tomorrow.
— Nani (@NameisNani) August 26, 2021