Movies : ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యే తెలుగు సినిమాలు ఇవే..
మే మూడో వారంలో కూడా తెలుగులో పెద్ద సినిమాలేమి లేవు. కేవలం రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి డైరెక్ట్ సినిమా, ఇంకోటి డబ్బింగ్ సినిమా.

May 3rd week Theatrical Releasing Movies
Theatrical Releases : ఒకప్పుడు సమ్మర్(Summer) అంటే స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కి లైన్ లో ఉండేవి. కానీ ఈ సమ్మర్ లో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా లేకపోవడం ఆశ్చర్యం. దీంతో చిన్న, మీడియం హీరోలు సమ్మర్ టార్గెట్ గ ఆసినిమాలు రిలీజ్ చేస్తున్నారు. గత వారం నాగచైతన్య(Naga Chaitanya) కస్టడీ సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. కలెక్షన్స్ ఆశించినంతగా లేకపోయినా కస్టడీ(Custody) సినిమాపై ప్రశంసలు వస్తున్నాయి.
ఇక మే మూడో వారంలో కూడా తెలుగులో పెద్ద సినిమాలేమి లేవు. కేవలం రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి డైరెక్ట్ సినిమా, ఇంకోటి డబ్బింగ్ సినిమా.
2016లో వచ్చిన తమిళ్ డబ్బింగ్ సినిమా బిచ్చగాడు(Bichagadu) తెలుగులో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ బ్లాక్ బస్టర్ మూవీ కి సీక్వెల్ గా బిచ్చగాడు 2 మే 19న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. బిచ్చగాడు 2లో విజయ్ ఆంటోనీ హీరోగా నటించడమే కాక దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ భార్య నిర్మాతగా వ్యవహరించింది. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి.

యువ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్(Malavika Nayar) జంటగా నందిని రెడ్డి(Nandini Reddy) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అన్నీ మంచి శకునములే'(Anni Manchi Shakunamule). ఈ సినిమా మే 18న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. స్వప్న సినిమాస్ బ్యానర్ లో తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రమోషన్స్ మాత్రం భారీగా చేస్తున్నారు. సమ్మర్ లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కథతో రాబోతుంది ఈ సినిమా. చాలా మంది సీనియర్ యాక్టర్స్ ఈ సినిమాలో నటించారు. తొలిప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ కి చెల్లిగా నటించిన వాసుకి ఈ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ ఇస్తోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.
శ్రీవిష్ణు సామజవరగమన సినిమా కూడా మే 18న రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించినా మళ్ళీ ఆ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్, ప్రమోషన్ లేదు. దీంతో ఆ సినిమా ఈ వారం ఉండకపోవచ్చు అని సమాచారం.