ప్రతీ ఫోన్‌లో ఓ సీక్రెట్ ఉంటుంది : ‘మీకు మాత్రమే చెప్తా’ ట్రైలర్

విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న‘మీకు మాత్రమే చెప్తా’ ట్రైలర్ లాంచ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా చిత్ర యూనిట్ సమక్షంలో జరిగింది..

  • Published By: sekhar ,Published On : October 16, 2019 / 12:50 PM IST
ప్రతీ ఫోన్‌లో ఓ సీక్రెట్ ఉంటుంది : ‘మీకు మాత్రమే చెప్తా’ ట్రైలర్

Updated On : October 16, 2019 / 12:50 PM IST

విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న‘మీకు మాత్రమే చెప్తా’ ట్రైలర్ లాంచ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా చిత్ర యూనిట్ సమక్షంలో జరిగింది..

విజయ్ దేవరకొండ ‘ఎ కింగ్ ఆఫ్ ది హిల్ ప్రొడక్షన్’ బ్యానర్‌పై, తరుణ్ భాస్కర్‌ను హీరోగా, షమ్మీర్ సుల్తాన్‌ను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా చిత్ర యూనిట్ సమక్షంలో జరిగింది.

 
ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ : ‘ఈ కాంబినేషన్ కొత్త గా ఉంది. విజయ్ ప్రొడ్యూసర్, తరుణ్ భాస్కర్ హీరో అని వినగానే కొత్తగా అనిపించింది. ‘పెళ్ళి చూపులు’ నాకు బాగా నచ్చిన సినిమా, విజయ్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అన్నారు.

Read Also : హాం ఫట్.. అలియా భట్ : ‘భూత్ రాజా’ వీడియో సాంగ్

ట్రైలర్ ఫన్నీగా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఆర్టిస్టుల నేచురల్ పర్ఫార్మెన్స్, వెన్నెల కిషోర్ వాయిస్ ఓవర్, విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. నవంబర్ 1న ‘మీకు మాత్రమే చెప్తా’ విడుదల కానుంది. తరుణ్ భాస్కర్, అనసూయ భరద్వాజ్‌తో పాటు అభినవ్ గౌతమ్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ, జీవన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

సినిమాటోగ్రఫీ : మదన్ గుణదేవా, సంగీతం : శివకుమార్, ఆర్ట్ డైరెక్టర్ : రాజ్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్ : విజయ్ మట్టపల్లి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అనురాగ్ పర్వతనేని,
నిర్మాతలు : విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ, రచన-దర్శకత్వం : షమ్మీర్ సుల్తాన్.