Meenaakshi Chaudhary : పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది జనాల్లో.. అనగనగా ఒక రాజు ప్రమోషన్స్ లో మీనాక్షి చౌదరి కామెంట్స్..
హీరోయిన్ మీనాక్షి చౌదరి నేడు మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.(Meenaakshi Chaudhary)
Meenaakshi Chaudhary
- మీనాక్షి చౌదరి ఇంటర్వ్యూ
- అనగనగా ఒక రాజు ప్రమోషన్స్
- పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర కామెంట్స్
Meenaakshi Chaudhary : నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా వస్తున్న సినిమా ‘అనగనగా ఒక రాజు’. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో మారి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ మీనాక్షి చౌదరి నేడు మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.(Meenaakshi Chaudhary)
సినిమా గురించి, అందులో మీనాక్షి పాత్ర గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నా పాత్ర పేరు చారులత. బాగా డబ్బున్న ఫ్యామిలిలో పుట్టి తండ్రి గారాల పట్టి లాంటి పాత్ర. చాలా మంచి, అమాయక అమ్మాయి. నన్ను పూర్తి కామెడీ పాత్రలో చూడబోతున్నారు. నిజ జీవితంలో కాలేజ్ సమయంలో ఇలాంటి వాళ్ళను చూసాను. డైరెక్టర్ ఇచ్చిన ఇన్ పుట్స్, నాకున్న అవగాహనను బట్టి ఈ పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశాను. నా నిజ జీవిత పాత్రకు భిన్నంగా ఈ పాత్ర ఉంటుంది. ఇలాంటి ఫుల్ కామెడీ పాత్ర చేయడం ఇదే మొదటిసారి. ఈ సినిమా వల్ల నటిగా నేను మరింత ఓపెన్ అయ్యాను. ఈ సినిమాలో భీమవరం బాల్మా, రాజు గారి పెళ్ళిరో లాంటి మాస్ డ్యాన్స్ నెంబర్స్ కూడా చేశాను. సాధారణంగా నేను డ్యాన్స్ చేయడానికి సిగ్గుపడతాను కానీ ఈ సినిమాలో అలాంటి ఇబ్బంది కలగలేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కామెడీగా ఉన్నా నా పాత్ర కాస్త సీరియస్ గా ఉంటుంది కానీ పూర్తిగా కామెడీగా ఉంటుంది. కామెడీ పంచ్ డైలాగ్స్ కరెక్ట్ టైమింగ్ లో చెప్పడం ఛాలెంజింగ్ గా అనిపించింది అని తెలిపింది.
Also Read : Pawan Kalyan : కరాటే నుంచి సమురాయ్ వరకు.. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ జర్నీ.. అరుదైన గౌరవం.. వీడియో వైరల్..
Meenaakshi Chaudhary
నవీన్ పోలిశెట్టి గురించి మాట్లాడుతూ.. నవీన్ తో వర్క్ చేయడం సినిమా టీచింగ్ స్కూల్ లా ఉంది. సంక్రాంతికి వస్తున్నాంలో కామెడీ ఒకలా ఉంటే నవీన్ కామెడీ మరోలా ఉంటుంది. కామెడీ విషయంలో ఆయన చాలా సపోర్ట్ చేసారు అని తెలిపింది.
ఇక ఈ సినిమా గోదావరి జిల్లాల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడంతో అక్కడ షూటింగ్ అనుభవం గురించి చెప్తూ.. గోదావరి ప్రాంతాలు చాలా బాగున్నాయి. అక్కడి ప్రజలు బాగా చూసుకున్నారు. వాళ్లకు సినిమా అంటే పిచ్చి. షూటింగ్ జరుగుతుంటే వాళ్ళ పని మానేసి మరీ వచ్చి షూటింగ్ చూస్తున్నారు. గోదావరి ఫుడ్ బాగా అతిన్నను. అక్కడ పిఠాపురం శక్తిపీఠం కూడా చూసాను అని తెలిపింది.
Also Read : Chinna Jeeyar Swamy : అఖండ 2 సినిమాని ప్రశంసించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి..
సినిమాలలో హీరోయిన్స్ పాత్రలపై, తను చేసే పాత్రల గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు సినిమాలలో హీరోయిన్ పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ప్రాధాన్యత ఉన్న పాత్రలు నాకు వస్తున్నాయి. లక్కీ భాస్కర్ ఒక బాబుకి తల్లిగా కనిపించాను. సంక్రాంతికి వస్తున్నాంలో ఐపీఎస్ గా కనిపించాను. ఇప్పుడు ఇంకో డిఫరెంట్ పాత్రలో చేస్తున్నాను. దర్శకుడు కథను, అందులోని పాత్రలను ఎలా చూపించబోతున్నారు అనేది ఆలోచిస్తాను. నేను చేసే పత్రాలు ఎక్కువ ఇంపాక్ట్ ఉండేలా చూసుకుంటాను. పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ జనాల్లో చాలా ఉంటుంది. అలా జనాలకు కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నాను నా సినిమాల ద్వారా అని తెలిపింది.
ఇక సితార సంస్థలో ఇది మీనాక్షికి మూడో సినిమా. దీనిపై స్పందిస్తూ.. సితార సంస్థ నాకు ఫ్యామిలీ లాంటిది. ఈ సంస్థ యువ ప్రతిభను ప్రోత్సహిస్తుంది. ఈ సంస్థ నుంచి నాకు వరుస సినిమాలు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మళ్ళీ ఈ బ్యానర్ లో పనిచేశాను అని తెలిపింది.
