Tillu Square: టిల్లు కోసం ఇంతమంది రాధికలా.. చివరకి ఎవరుంటారో?

టాలీవుడ్‌లో చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ హిట్‍‌గా నిలిచిన ‘డీజే టిల్లు’ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో అందరం చూశాం. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ను ఇటీవల అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాను హీరోయిన్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.

Meenakshi Chaudhary In Talks For Tillu Square Movie

Tillu Square: టాలీవుడ్‌లో చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ హిట్‍‌గా నిలిచిన ‘డీజే టిల్లు’ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో అందరం చూశాం. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ను ఇటీవల అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాను హీరోయిన్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తొలిభాగంలో రాధిక పాత్రలో అందాల భామ నేహా శెట్టి పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

DJ Tillu 2: సీక్వెల్ రిలీజ్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన డీజే టిల్లు!

కాగా, సీక్వెల్ పార్ట్‌లో నేహా శెట్టిని పక్కనబెట్టి వేరొక హీరోయిన్‌ను ఎంపిక చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఈ క్రమంలో తొలుత ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, ఆమె స్థానంలో మరో బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ను ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లుగా చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో, మళ్లీ హీరోయిన్ సమస్య మొదటికి వచ్చింది. ఇక ఇటీవల ఈ సినిమాలో మడోనా సెబాస్టియన్‌ను హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెరపైకి రావడంతో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది.

DJ Tillu 2 : టిల్లు స్క్వేర్ నుంచి అనుపమ అవుట్?

ఇటీవల హిట్-2 సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న భామ మీనాక్షి చౌదరిని ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకునేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. మరి ఇంతమంది హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్న టిల్లు స్క్వేర్ మూవీలో చివరకు ఏ హీరోయిన్ ఉంటుందో అని అభిమానులు అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది.