DJ Tillu 2 : టిల్లు స్క్వేర్ నుంచి అనుపమ అవుట్?

ఈ ఏడాది మొదటిలో చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అతిపెద్ద హిట్టుని సొంతం చేసుకున్న సినిమా 'డీజే టిల్లు'. యూత్ లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న ఈ సినిమాకు సీక్వెల్ తీసుకువచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు మేకర్స్. ఇక టిల్లు సరసన డీజే వాయించేందుకు అనుపమ పరమేశ్వరన్ రంగంలోకి దిగింది. కాగా...

DJ Tillu 2 : టిల్లు స్క్వేర్ నుంచి అనుపమ అవుట్?

Anupama Parameswaran walked out Tillu Square

DJ Tillu 2 : ఈ ఏడాది మొదటిలో చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అతిపెద్ద హిట్టుని సొంతం చేసుకున్న సినిమా ‘డీజే టిల్లు’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి ప్రధాన పాత్రలో కనిపించారు. సినిమాలోని సిద్దు బాడీ లాంగ్వేజ్ అండ్ స్లాంగ్ కి ఆడియన్స్ ఫిదా అయ్యిపోయారు. యూత్ లో ఇంతటి క్రేజ్ ని సంపాదించుకున్న ఈ సినిమాకు సీక్వెల్ తీసుకువచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు మేకర్స్.

DJ Tillu: ముచ్చటగా ముగ్గురుని మార్చిన డీజే టిల్లు.. ఎటు వెళ్తుందో?

ఆ నేపథ్యంలోనే ‘టిల్లు స్క్వేర్’ అనే టైటిల్ తో సీక్వెల్ ను కూడా ప్రకటించారు. కానీ ఈ సినిమా మొదలయిన దగ్గర నుంచి ఏదొక అడ్డంకి వస్తూనే ఉంది. మొదటిలో ‘డీజే టిల్లు’ తెరకెక్కించిన దర్శకుడినే సీక్వెల్ కు తీసుకున్నా, తరువాత మల్లిక్ రామ్ ని దర్శకుడిగా ఎంపిక చేశారు. హీరోయిన్ విషయంలో కూడా మొదటిగా పెళ్లిసందD ఫేమ్ శ్రీలీలని ఎంపిక చేశారు.

కానీ ఆ తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇక టిల్లు సరసన డీజే వాయించేందుకు అనుపమ పరమేశ్వరన్ రంగంలోకి దిగింది. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో పాల్గొనడమే కాదు, కొంతభాగం షూటింగ్ కూడా చేసింది అనుపమ. కానీ ఇప్పుడు సడన్ గా ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ప్లేస్ లోకి ప్రేమమ్ సుందరి మడోన్నా సెబాస్టియన్‌ ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.