ఫుడ్ లో పురుగులు: పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఆగ్రహం

  • Published By: vamsi ,Published On : August 27, 2019 / 01:11 AM IST
ఫుడ్ లో పురుగులు: పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఆగ్రహం

Updated On : August 27, 2019 / 1:11 AM IST

తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న హీరోయిన్ మీరా చోప్రా. తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన ”బంగారం” సినిమాలో నటించిన ఈ భామ ‘వాన’ సినిమాలో కూడా నటించింది. అయితే ఈ అమ్మడుకి తెలుగులో పెద్దగా కలిసి రాకపోవడంతో బాలీవుడ్ సినిమాల్లోనే ఎక్కువగా చేస్తుంది.

ఇదిలా ఉంటే లేటెస్ట్ గా టిఫిన్ చేసేందుకు ఓ స్టార్ హోటల్ కు వెళ్లిన ఈ భామకు చేదు అనుభవం ఎదరైంది. ఆమెకు తెచ్చిచ్చిన ఫుడ్ లో పురుగులు ఉండడంతో ఆ ఫుడ్ ను వీడియో తీసి ఆమె సోషల్ మీడియాలో పెట్టి ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీనికి సంబంధించి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన  మీరా చోప్రా… ‘అహ్మదాబాద్‌లోని డబుల్‌ ట్రీ అనే హోటల్‌కు వెళ్లా. అక్కడ ఫుడ్‌ ఆర్డర్‌ చేయగా అందులో తెల్లటి పురుగులు కనిపించాయి. భారీ మొత్తంలో డబ్బు తీసుకుని నాకు ఇలాంటి పురుగులు ఉన్న ఫుడ్‌ పెట్టారు. ఇది చూసి షాక్‌ అయ్యా.. ఆహార భద్రతా అధికారులు వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి’ అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ప్రస్తుతం అజయ్‌ భట్ దర్శకత్వంలో ‘సెక్షన్‌ 375’ సినిమాలో మీరా నటిస్తుంది.