మెగా ఫ్యామిలీ దివాళీ సెలబ్రేషన్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దీపావళి పండుగను తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దీపావళి పండుగను తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు..
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అంతా కలిసి దీపావళి పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ దీపావళి పండుగను తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.
భార్య అన్నా లెజినోవా, కుమారులు అకీరా నందన్, మార్క్ శంకర్ పవనోవిచ్, కూతురు ఆద్యతో కలిసి చిరు ఇంటికి వెళ్లారు పవన్.. అక్కడ తన కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. తల్లి అంజనాదేవీతో కలిసి చిరు, సురేఖ, నాగబాబు అండ్ ఫ్యామిలీ, పవన్ అండ్ ఫ్యామిలీ సహా ఇతర కుటుంబ సభ్యులు దీపావళి సంబరాలను జరుపుకున్నారు.
Read Also : విశ్వనటుడు ఊరికే అవరు : స్పాట్‌లో పది వేరియేషన్స్ చూపించిన కమల్ హాసన్
ఒకరికొరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, స్వీట్లు తినిపించుకుంటూ.. టపాసులు కాలుస్తూ సందడి చేశారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాభిమానులు ఈ పిక్స్‌ను విపరీతంగా షేర్ చేస్తున్నారు.