Ustaad Bhagat Singh: ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్రదర్స్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్పెషల్ స్క్రీనింగ్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్!
పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh)' సినిమాను మెగా ఫ్యామిలీ అంతా కలిసి చూశారు.
Mega Family watched pawan kalyan Ustaad Bhagat Singh movie
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh)’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఉగాది కానుకగా మార్చి 19న విడుదలైన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్, భారీ కలెక్షన్ల నేపథ్యంలో చిత్ర యూనిట్ ఫుల్ జోష్‌లో ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమాను వీక్షించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖతో కలిసి ప్రత్యేకంగా ఈ సినిమాను చూశారు. వీరితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవా కూడా హాజరయ్యారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్‌లో చిత్ర దర్శకుడు హరీష్ శంకర్, హీరోయిన్ శ్రీలీల, దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి పాల్గొన్నారు. మెగా బ్రదర్స్ ఇద్దరూ కలిసి ఒకే చోట సినిమాను ఎంజాయ్ చేయడం అభిమానులకు కన్నుల పండుగగా నిలిచింది. దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, అది క్షణాల్లోనే వైరల్‌గా మారింది.
ఇక సినిమా విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ మార్క్ మేనరిజమ్స్, పవర్ఫుల్ డైలాగ్స్ థియేటర్లలో ఈలలు వేయిస్తున్నాయి. మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇప్పటికే భారీ వసూళ్లను రాబట్టింది. లాంగ్ వీకెండ్ కావడంతో రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Megastar @KChiruTweets Garu watched #UstaadBhagatSingh with his family and thoroughly enjoyed it ❤️
He loved every moment of the film and appreciated the efforts of the entire team ❤🔥
Don’t miss his reaction for Vaana Vaana Velluvaaye & EE Manase songs 😍
Watch… pic.twitter.com/GYB0cBOcKn
— Mythri Movie Makers (@MythriOfficial) March 21, 2026
