మరో మెగా హీరోకి కరోనా పాజిటివ్.. ఆ పార్టీలోనే వైరస్ సోకిందా?!

మరో మెగా హీరోకి కరోనా పాజిటివ్.. ఆ పార్టీలోనే వైరస్ సోకిందా?!

Updated On : December 29, 2020 / 5:41 PM IST

Mega Hero Varun Tej Tests Covid-19 Positive: మెగా కుటుంబంలో కరోనా కలకలం ఇప్పుడు టెన్షన్ పెడుతుంది. ఇప్పటికే మెగా కుటుంబంలో పలువురికి కరోనా పాజిటివ్ రాగా.. ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ కూడా కరోనా పాజిటివ్ అయ్యారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కొవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అవగా.. తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని వరుణ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకు చాలా తక్కువ లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు. త్వరలోనే కోలుకుంటానంటూ వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.

రామ్ చరణ్‌కు పాజిటివ్ అని తెలిసిన వెంటనే మెగా అభిమానులు కాస్త కంగారు పడగా.. ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు కూడా కొవిడ్-19 పాజిటివ్ అని రావడం మెగా ఫ్యాన్స్‌లో కంగారు పెరిగింది. ‘‘ఈరోజు ఉదయం కొవిడ్-19 పరీక్ష చేయించుకున్నాను. స్వల్ప లక్షణాలతో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను హోం క్వారంటైన్‌లో ఉన్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తాను’’ అంటూ వరుణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.


https://10tv.in/corona-virus-positive-for-hero-ram-charan/
మెగా ఫ్యామిలీ ఇటీవల డిసెంబర్ 25న క్రిస్మస్‌ను కలిసి సెలబ్రేట్ చేసుకోగా.. ఈ సెలబ్రేషన్స్‌లో అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, అల్లు బాబీ, కళ్యాణ్ దేవ్, ఉపాసన, స్నేహారెడ్డి, సుష్మిత, శ్రీజ, నిహారిక, చైతన్య జొన్నలగడ్డ తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ పార్టీ వల్లే వీరి మధ్య వైరస్ వ్యాప్తి చెంది ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో కలిసినవారు అంతా కూడా కరోనా పరిక్షలు చేయించుకుంటున్నారు.