Mega Heros : 300 కోట్లు కొల్లగొట్టిన ముగ్గురు మొనగాళ్లు.. మెగా సంబరం..
మెగా హీరోలు, ముగ్గురు మొనగాళ్లు మూడొందల కోట్లు అవలీలగా సాధించేశారని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. (Mega Heros)
Mega Heros
Mega Heros : మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మెగా హీరోలంతా వరుస హిట్స్ కొడుతున్నారు. కలెక్షన్స్ భారీగా రాబడుతున్నారు. సరికొత్త అవతారాలలో హీరోలు కనిపిస్తూ అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో ఫ్యాన్స్ ని మెప్పిస్తున్నారు. ఇప్పుడు మెగా హీరోలు, ముగ్గురు మొనగాళ్లు మూడొందల కోట్లు అవలీలగా సాధించేశారని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.
2025 సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ OG సినిమా రిలీజయి భారీ విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ ఊహించని ఓ కొత్త స్టైలిష్ అవతారంలో కనిపించి ఫ్యాన్స్ ని మెప్పించాడు. పవన్ లుక్స్ కి, OG సినిమాకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆ సినిమా 310 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి పవన్ కెరీర్లో భారీ విజయం సాధించింది.
ఇక 2026 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాతో వచ్చి అదరగొట్టారు. ఈ సినిమాలో చిరంజీవి కొత్త లుక్స్ లో మరింత అందంగా కనిపించారు. 70 ఏళ్ళ వయసులో కూడా ఫిట్నెస్, అందం బాగా మెయింటైన్ చేస్తున్నారు అంటూ చిరు పై ప్రశమసలు కురిపించారు అంతా. సినిమాలో స్టైలిష్ పర్ఫార్మెన్స్ తో, కామెడీతో చిరు అదరగొట్టారు. ఈ సినిమా కూడా 300 కోట్లకు పైగా వసూలు చేసి రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
ఇక తాజాగా రామ్ చరణ్ పెద్ది సినిమా హవా నడుస్తుంది. ఇటీవల రిలీజయిన పెద్ది సినిమా ఇప్పటికే 320 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకెళ్తుంది. ఈజీగా ఈ సినిమా 400 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుంది. ఈ సినిమాలో చరణ్ పడిన కష్టం, చరణ్ పర్ఫార్మెన్స్ కి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
Also Read : Nagarjuna Amala : నాగార్జున – అమల పెళ్లి రోజు.. ఈ జంట పాత ఫోటోలు చూశారా..?
ఇలా ముగ్గురు మెగా హీరోలు ముగ్గురు మొనగాళ్లుగా తలా మూడొందల కోట్లు కొట్టి ఏకంగా 900 కోట్లకు పైగా మూడు సినిమాలతోనే బిజినెస్ చేసి కష్ట సమయాల్లో టాలీవుడ్ ని కాసింత గట్టెక్కించారు. ఈ విజయాలు, కలెక్షన్స్ పై మెగా ఫ్యాన్స్ అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
