Varun Lavanya : వ‌రుణ్ లావ‌ణ్య ప్రీవెడ్డింగ్ సెల‌బ్రేష‌న్ వీడియో చూశారా..? లీక్ చేసిన మెగా స్టార్‌

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠితో ఈ ఆరున్న‌ర అడుగుల అంద‌గాడు ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

Varun Lavanya : వ‌రుణ్ లావ‌ణ్య ప్రీవెడ్డింగ్ సెల‌బ్రేష‌న్ వీడియో చూశారా..? లీక్ చేసిన మెగా స్టార్‌

Varun lavanya Pre Wedding Celebrations

Updated On : October 29, 2023 / 11:25 AM IST

Varun Lavanya pre wedding celebrations : మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ముకుంద చిత్రంతో అరంగ్రేటం చేసిన వ‌రుణ్ తేజ్ విభిన్న‌మైన సినిమాల‌ను చేస్తూ త‌న కంటూ ఓ ప్ర‌త్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠితో ఈ ఆరున్న‌ర అడుగుల అంద‌గాడు ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. దాదాపు ఆరేళ్లు ఎవ‌రికి తెలియ‌కుండా ప్రేమించుకున్న వీరు ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు.

ఇరు కుటుంబాలు, అత్యంత స‌న్నిహితుల స‌మ‌క్షంలో వీరి నిశ్చితార్థం జ‌రిగింది. వీరి వివాహాం అక్టోబ‌ర్ చివ‌ర‌ల్లో లేదంటే న‌వంబ‌ర్ లో ఉండొచ్చున‌ని స‌మాచారం. ఇప్ప‌టికే మెగా కుటుంబంలో పెళ్లి సంద‌డి మొద‌లైంది. శుక్ర‌వారం రాత్రి వరుణ్ లావణ్య ల ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రెష‌న్స్ జ‌రిగాయి. ఈ సెల‌బ్రేష‌న్స్‌కి చరణ్, ఉపాసన, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్.. ఇలా మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ, అల్లు ఫ్యామిల కుటుంబ స‌భ్యులు అంద‌రూ హాజ‌రు అయ్యారు.

Varun Lavanya Pre Wedding Celebrations : వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫొటోలు..

Varun lavanya Pre Wedding Celebrations

Varun lavanya Pre Wedding Celebrations

‘వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్. ఎంతో సంతోషకరమైన క్షణాలు..’ అంటూ మెగాస్టార్ చిరంజీవి ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా సెలబ్రేష‌న్స్‌కు సంబంధించిన‌ ఆయ‌న వీడియోను సైతం పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. దీంతో ఫ్యాన్స్ ఈ వీడియో కింద కామెంట్స్ పెడుతూ వీరి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుపుతున్నారు.

Unstoppable With NBK : బాలయ్య సూపర్ టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 3 వచ్చేస్తుంది.. కానీ..