మెగా ‘మార్చ్’.. మూడు రోజులు.. మూడు మెగా అప్‌డేట్లు..

మార్చి నెల చివరివారంలో మెగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజెస్ ఇవ్వనున్న మెగా హీరోలు..

  • Published By: sekhar ,Published On : March 12, 2020 / 12:04 PM IST
మెగా ‘మార్చ్’.. మూడు రోజులు.. మూడు మెగా అప్‌డేట్లు..

Updated On : March 12, 2020 / 12:04 PM IST

మార్చి నెల చివరివారంలో మెగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజెస్ ఇవ్వనున్న మెగా హీరోలు..

మార్చి నెలలో తమ అభిమానులకు సర్‌ప్రైజ్‌లు మెగా హీరోలు రెడీ అవుతున్నారు. మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ తమ కొత్త సినిమా ప్రకటనలతో అభిమానులను అలరించనున్నారు. చిరు, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ నటిస్తున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్‌, కోలీవుడ్‌లో విజయవంతమైన ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’‌లో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్.. అలాగే దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్ నటిస్తున్నారు. ఈ నెలలోనే ఈ సినిమాలకు సంబంధించిన సర్‌ప్రైజ్‌లతో ఈ ముగ్గురు మెగా హీరోలు అభిమానులను ఖుషీ చేయనున్నారు.

ఉగాది సందర్భంగా ఈ నెల 25వ తేదీ ఉదయం ‘ఆచార్య’ టైటిల్ లోగో విడుదల కానుంది. అదే రోజు సాయంత్రం ‘వకీల్ సాబ్’ టీజర్ రిలీజ్ చేయాలని మూవీ టీమ్ ఆలోచనగా తెలుస్తోంది. రెండు రోజుల తర్వాత మార్చి27న రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’లోని అల్లూరి సీతారామరాజు లుక్ బయటకు వస్తుందని సమాచారం. మొత్తానికి వరస అప్‌డేట్లతో మార్చి నెలలో మెగాఫ్యాన్స్‌కు పండుగ జోష్ డబుల్ అవనుంది.