Chiranjeevi Fan : దివ్యాంగ అభిమాని సాహసం.. చలించిపోయిన చిరు..

ఈ వార్త తెలిసి చిరంజీవి చలించి పోయి వెంటనే ఇంటికి పిలిపించుకుని గంగాధర్‌తో సమయం గడిపారు..

Chiranjeevi Fan : దివ్యాంగ అభిమాని సాహసం.. చలించిపోయిన చిరు..

Dekkala Gangadhar

Updated On : October 26, 2021 / 4:32 PM IST

Chiranjeevi Fan: ‘స్వయంకృషి’తో ఎదిగి టాలీవుడ్ నెం.1 స్థానానికి చేరిన మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రాణం ఇచ్చే అభిమానులు ఎందరో ఉన్నారు. అలాంటి అభిమానులలో ఒకడైన డెక్కల గంగాధర్ చిరును కలిసేందుకు పాదయాత్ర ప్రారంభించాడు.

Akira Nandan : ‘లిటిల్ పవర్‌‌స్టార్’ ఎంట్రీ ఫిక్స్.. అందుకే ఇవన్నీ..

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నుంచి హైదరాబాద్ వరకు ఆయన పాదయాత్ర చేసాడు. ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువుకు చెందిన డెక్కల గంగాధర్‌ అనే అభిమాని అక్టోబర్ 3వ తేదీన కాలి నడకన హైదరాబాద్‌ బయలుదేరాడు.

Kajal Aggarwal : ఇదీ కాజల్ క్రేజ్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మాస్టర్‌’ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిరంజీవిని చూడాలనే తపనతో పాదయాత్ర ప్రారంభించినట్టు గంగాధర్‌ తెలిపాడు. చిరంజీవి నుంచి ఏమి ఆశించడం లేదని, కలిస్తే చాలని అదే పది వేలని భవిస్తూ 726 కి.మీ దూరం నడిచి హైదరాబాద్ వచ్చాడు డెక్కల గంగాధర్.

Chiranjeevi : కుడి చేతికి సర్జరీ చేశారు.. అభిమానులు ఆందోళన చెందకండి..

ఈ మధ్య కాలంలో తమ తమ అభిమాన నటీనటుల కోసం పాదయాత్రలు చేయడం కామన్ అయిపోయాయి ఇదీ అలాంటిదే అనుకోవడానికి లేదు ఎందుకంటే గంగాధర్ దివ్యాంగుడు. అమలాపురం తాలూకా ఉప్పలగుప్తం మండలానికి చెందిన కిత్తనచెరువు గ్రామ వాసి అయిన డెక్కల గంగాధర్ కాలినడకనే చిరంజీవి గారిని కలవాలనే ఉద్దేశంతో బ్లడ్ బ్యాంక్‌కు చేరుకున్నాడు.

RRR Pre- Release Event : జక్కన్న ప్లాన్ అదిరిందిగా

ఈ వార్త తెలిసి చిరంజీవి చలించి పోయి వెంటనే ఇంటికి పిలిపించుకుని గంగాధర్‌తో సమయం గడిపారు. అనంతరం గంగాధర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అతని కుటుంబ నేపథ్యం, ఇతర విషయాలు అడిగి తెలుసుకున్న చిరంజీవి ఇలాంటి సాహసాలు మళ్లీ చేయవద్దని సున్నితంగా హెచ్చరించారు.

Sarkaru Vaari Paata : ముద్దుగుమ్మల మధ్య మహేష్

అయితే తమ అభిమాన హీరోను చూస్తే చాలనుకున్న గంగాధర్ చిరంజీవి ఆతిధ్యానికి పులకించిపోయాడు. చిరును కలవడంతో గంగాధర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాను జీవితాంతం రుణపడి ఉంటాను అని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాడు.

Prabhas : ప్రభాస్ ఫ్యామిలీ గొప్పదనం.. పనిమనిషికి సన్మానం..