Balakrishna – Chiranjeevi : నాకు బాలయ్యతో ఫ్యాక్షన్ సినిమా చేయాలని కోరిక.. బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలో చిరు స్పీచ్..
బాలయ్య బాబు. 50 ఏళ్ళ బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.

Megastar Chiranjeevi Speech in Balakrishna 50 Years Event goes Viral
Balakrishna – Chiranjeevi : బాలకృష్ణ సినీ పరిశ్రమలోకి వచ్చి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ గ్రాండ్ గా బాలకృష్ణ నట స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించింది. 1974లో తాతమ్మ కల సినిమాతో ఎంట్రీ ఇవ్వగా అప్పట్నుంచి 50 ఏళ్లుగా నటిస్తూనే ఉన్నాడు బాలయ్య బాబు. 50 ఏళ్ళ బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవితో పాటు వెంకటేష్, శ్రీకాంత్, నాని, ఉపేంద్ర, శివన్న, మోహన్ బాబు, విజయ్ దేవరకొండ, రానా, మంచు మనోజ్, రాఘవేంద్రరావు, ఇలా ఎంతోమంది నటీనటులు, డైరెక్టర్స్, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
Also Read : Chiranjeevi – Balakrishna : ఒకే వేదికపై చిరు – బాలయ్య.. బాలకృష్ణ నట స్వర్ణోత్సవ వేడుకలకు మెగాస్టార్..
బాలయ్య ఈవెంట్ కి చిరంజీవి రావడంతో, ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్టేజిపై ఉండటంతో ఈ ఈవెంట్ బాగా వైరల్ అయింది. ఈ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. బాలయ్య బాబు 50 ఏళ్ళ వేడుకలో మేము పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది బాలయ్యకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్ర పరిశ్రమకు వేడుకలా చూస్తున్నాను. అరుదైన రికార్డుని బాలయ్య సొంతం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ గారికి ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కొడుకుగా బాలకృష్ణ ఎన్నో పాత్రలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ప్రత్యేకత చాటుకున్నారు. నేను ఇంద్ర సినిమా చేయడానికి బాలకృష్ణ సమర సింహారెడ్డి సినిమానే ఆదర్శం. నాకు బాలయ్యతో కలిసి ఒక ఫాక్షన్ సినిమా చేయాలని కోరిక ఉంది. మా ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. ఫ్యాన్స్ కోసం హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం ఇలాంటి వేడుకలు చేసుకునేవాళ్లం. మా ఇంట్లో శుభకార్యాలకు బాలయ్య వచ్చి మాతో కలిసి డ్యాన్స్ కూడా వేస్తారు. ఈ 50 సంవత్సరాల ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు బాలయ్యకు ఇదే ఎనరీ ఇస్తూ 100 ఏళ్లు బావుండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. రాజకీయ, వైద్య రంగాలలో ఇలా సేవ చేయడం న భూతో న భవిష్యత్. మేము అంతా ఒక కుటుంబం లాంటి వాళ్ళం. ఇది ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలో అని కోరుకుంటున్నాను అన్నారు. దీంతో చిరంజీవి స్పీచ్ వైరల్ గా మారింది.
Frame of the Decade ❤️🔥😭🥵
Pillars of TFI Balayya – Chiru – Venky 🔥#NBK50inTFI #NBK109 #NandamuriBalakrishna #Chiranjevvi #Venkatesh pic.twitter.com/bs8eCoTOmf
— NBK Cult 🦁 (@iam_NBKCult) September 1, 2024
Lovely moments captured from the grand #NBK50YearsCelebrations. 🤩❤️#NandamuriBalakrishna #NBK pic.twitter.com/Zf2nWutLR4
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) September 1, 2024
Chiranjeevi felicitating Balayya🔥
Jai balayya jai balayya🔥🔥#NandamuriBalakrishna #NBK50inTFI #NBK109 #NBK50YearsCelebrations #NBKGoldenJubilee pic.twitter.com/I7MKsdZvGs
— Ꮇᴏʜᴀɴ🦁NBK✌️ (@CBNBK6) September 1, 2024