Chiranjeevi – Balakrishna : ఒకే వేదికపై చిరు – బాలయ్య.. బాలకృష్ణ నట స్వర్ణోత్సవ వేడుకలకు మెగాస్టార్..
బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.
Chiranjeevi – Balakrishna : బాలకృష్ణ సినీ పరిశ్రమలోకి వచ్చి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ నిర్వహిస్తుంది. 1974లో తాతమ్మ కల సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు బాలయ్య. 50 ఏళ్ళ తన నట ప్రస్థానం పూర్తవడంతో అన్ని సినీ పరిశ్రమల నుంచి స్టార్స్ ని పిలిచి ఈవెంట్ గ్రాండ్ గా చేస్తున్నారు.
Also Read : Pawan Kalyan – OG : పవన్ పుట్టిన రోజుకు OG టీమ్ గిఫ్ట్ ఇదే.. వర్షాల వల్ల వాయిదా వేసినా..
బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. చిరంజీవి బాలకృష్ణని హత్తుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరూ ఈవెంట్లో పక్కపక్కనే కూర్చుకున్నారు. ఇండస్ట్రీ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ ఇలా కలిసి ఒకేచోట కనపడటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి అయ్యప్ప మాలలో రావడం గమనార్హం.
Both Pillars of TFI in One frame🥵
This is going to be the Biggest Event🔥#NandamuriBalakrishna #NBK50YearsCelebrations pic.twitter.com/et4wwrawzP
— NBK Fan (@Vd_311) September 1, 2024
Megastar @KChiruTweets arrived at the grand #NBK50YearsCelebrations event💥💥#NandamuriBalakrishna #Chiranjeevi #TeluguFilmNagar pic.twitter.com/sNzfdWroq9
— Telugu FilmNagar (@telugufilmnagar) September 1, 2024
అలాగే చిరంజీవితో పాటు ఈ ఈవెంట్ కి వెంకటేష్, శ్రీకాంత్, నాని, కన్నడ స్టార్ హీరోలు శివన్న, ఉపేంద్ర, మన సినీ పరిశ్రమ నుంచి ఎంతోమంది నటీనటులు, డైరెక్టర్స్ విచ్చేసారు. ఈ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఈవెంట్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వేడుకలో భాగంగా సోదర సమానుడు మెగాస్టార్ చిరంజీవి గారితో #NandamuriBalakrishna #nbk50inTFI pic.twitter.com/dLq0FtCDnA
— Nandamuri Balakrishna (@NBK_Unofficial) September 1, 2024
Pillors of TFI 🔥🔥
#NandamuriBalakrishna #NBK50Years #NBK50YearsCelebrations #NBKGoldenJubilee #NBK50InTFI pic.twitter.com/ZglChPBsTz— JA$HU’NTR’ (@Jashu_Chowdary9) September 1, 2024