Meher Ramesh : మెహర్ రమేష్ భోళా శంకర్ ఎఫెక్ట్.. టీం ఇండియా వరల్డ్ కప్ తెస్తుందా?
ఎన్టీఆర్-మెహర్ రమేశ్ కాంబోలో 2011లో శక్తి సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా కొట్టింది.

Meher Ramesh Bholaa Shankar Result reactions on Team India World cup
Meher Ramesh : మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా.. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ భోళా శంకర్(Bholaa Shankar). ఆగస్టు 11న బాక్సాఫీసు ముందుకు వచ్చిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. 2015లో తమిళం రిలీజ్ అయి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన వేదాళం చిత్రానికి రీమేక్‌గా భోళా శంకర్‌ను రూపొందించారు. స్టోరీ ఔట్ డేటేడ్ కాగా మెహర్ రమేశ్ టేకింగ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి వన్ మ్యాన్ షోతో ఆకట్టుకున్నా కథలో పసలేకపోవడంతో ఫ్లాప్ అయింది సినిమా. కథలో మార్పులు చేయడంతోనే ఇలా అయిందని డైరెక్టర్ మెహర్ రమేశ్‌ను టార్గెట్ చేస్తున్నారు మెగా అభిమానులు.
చిరంజీవి, తమన్నా జంటగా నటించిన సినిమా భోళా శంకర్ ప్లాప్ అవ్వడానికి డైరెక్టర్ మెహర్ రమేశే కారణమంటూ మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. సినిమాను చూసిన వారంతా చిరంజీవి ఇలాంటి సినిమా ఎందుకు తీసారంటూ తలలు పట్టుకుంటున్నారు. పదేళ్ల తరువాత దర్శకత్వం వహించినా మెహర్ రమేశ్ తీరుమారలేదంటూ తిట్టుకుంటున్నారు. ఇదే సమయంలో మెహర్ రమేశ్‌పై పంచ్‌లు వేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. షాడో, శక్తి వంటి ప్లాప్ తీసిన మెహర్ రమేశ్‌కు చాన్స్ ఇవ్వడమే చిరు చేసిన తప్పిదమంటూ కొందరు, భోళా శంకర్ ఫ్లాప్‌తో క్రికెట్ ప్రపంచ కప్ గ్యారెంటీ అంటూ మరికొందరూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఎన్టీఆర్-మెహర్ రమేశ్ కాంబోలో 2011లో శక్తి సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. అదే ఏడాది జరిగిన ప్రపంచకప్‌ను ధోనీ సేన సొంతం చేసుకుంది. 2009లో కూడా మెహర్ బిల్లా సినిమాతో వస్తే అప్పుడు టీమిండియా టెస్ట్ మేస్ గెలిచింది. ఇక 2013లో షాడో సినిమాతో వస్తే అప్పుడు టీమిండియా టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలిచిందని దీంతో ఇప్పుడు కూడా మన దేశంలో జరిగే వరల్డ్ కప్ టోర్నీకి ముందు మెహర్ మరో ప్లాప్ సినిమా తీశారని.. ఆ సెంటిమెంట్‌తో ఈ సారి ప్రపంచ్ కప్ మరోసారి కొట్టేస్తామంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. ఇలా అయినా మెగా అభిమానులు భోళా శంకర్ ప్లాప్‌ను దిగమింగుకుంటున్నారు.
మరోవైపు భోళా శంకర్ ప్లాప్‌తో దర్శకుడు కొరటాల శివకు సోషల్ మీడియా నుంచి పెద్ద ఉపశమనం లభించింది. చిరంజీవి కెరీర్‌లో ఇప్పటివరకు ఆచార్యే పెద్ద ప్లాప్ అనుకుంటే ఇప్పుడు భోళా శంకర్ ఆ రికార్డును చెరిపేసి పరమ చెత్త రికార్డును స్థాపించిందని అంటున్నారు అభిమానులు. డిజాస్టర్ మూవీగా పేరు తెచ్చుకున్న ఆచార్య తొలి మూడు రోజుల్లో 45 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక భోళా శంకర్ సినిమా మాత్రం కేవలం 40 కోట్లు మాత్రమే వసూలు చేసి అటు చిరంజీవికి, ఇటు నిర్మాత, ఫ్యాన్స్ షాక్ ఇచ్చింది.