Nandi Awards: ఏపీలో త్వరలో నంది అవార్డులు, చిత్ర పరిశ్రమకు కేరాఫ్‌గా వైజాగ్- మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన
ఒక నటుడు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో చిత్ర పరిశ్రమకు మంచి రోజులు రాబోతున్నాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.

Nandi Awards: ఏపీలో చలనచిత్ర రంగంలో మళ్లీ నంది అవార్డులు ఇవ్వబోతున్నామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. త్వరలో చిత్ర పరిశ్రమను నంది అవార్డులతో ప్రోత్సహిస్తామన్నారు. త్వరలో చలన చిత్ర ప్రముఖులతో ప్రత్యేక భేటీ కాబోతున్నామని చెప్పారు. హైదరాబాద్ తరహాలో వైజాగ్ ను చిత్ర పరిశ్రమకు కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి దుర్గేష్.
ఏపీలో సినిమా షూటింగ్స్ స్పాట్స్ ను అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తామన్నారు. ఒక నటుడు (పవన్ కల్యాణ్) డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో చిత్ర పరిశ్రమకు మంచి రోజులు రాబోతున్నాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
Also Read: షాకింగ్.. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్.. ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం
ఏలూరులో భైరవం సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్, హీరోయిన్లు, చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్ సైతం వేడుకలో పాల్గొన్నారు. ఈ నెల 30న మల్టీ స్టార్ తెలుగు మూవీ భైరవం రిలీజ్ కానుంది.