O Saathiya review : ఓ సాథియా రివ్యూ.. మొదటి ప్రేమ జ్ఞాపకాలతో క్యూట్ లవ్ స్టోరీ..
ప్రేమ కథల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ 'ఓ సాథియా' మూవీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నేడు జులై 7 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

Mishti Chakravarty Aryan Gowra O Saathiya Movie review and rating shows cute first love story memories
O Saathiya review : ఆర్యన్ గౌరా, మిస్టీ చక్రవర్తి(Mishti Chakravarty) హీరోహీరోయిన్లుగా కొత్త దర్శకురాలు దివ్య భావన దర్శకత్వంలో తన్వికా–జశ్వికా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన సినిమా ‘ఓ సాథియా’. చందన కట్టా, సుభాష్ కట్టా ఈ సినిమాని నిర్మించారు. నేడు జులై 7 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ప్రేమ కథల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ ఓ సాథియా మూవీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
కథ విషయానికొస్తే.. వైజాగ్‌లో బి.టెక్ చదువుకుంటూ టైమ్‌పాస్ చేసే అర్జున్ (ఆర్యన్ గౌరా) కి అనుకోకుండా ఒకరోజు తన కాలేజీలో తారసపడుతుంది కీర్తి (మిస్తీ చక్రవర్తి). మొదటి చూపులోనే అర్జున్, అర్జున్ అంటే అస్సలు పడని తన క్లాస్‌మేట్ మొదటిచూపులోనే హీరోయిన్ కీర్తి ప్రేమలో పడతారు. కీర్తి నాదంటే నాదంటూ కొట్టుకుంటుంటారు. ఇద్దరితో విసిగిపోయిన హీరోయిన్ వీళ్లని ఎలా తప్పించుకుని తిరగాలా అని ఆలోచిస్తుంటే వాడు నిన్ను ఏడిపించకుండా ఉండాలంటే మనిద్దరం ప్రేమలో ఉన్నాం అని చెప్పేసేయ్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని కీర్తికి అర్జున్ ఓ సలహా ఇస్తాడు. కీర్తి సరే అంటుంది. అక్కడనుండి మొదలైన వారి ప్రయాణం సరదా, సరదాగా ఉంటూ మంచి ఫ్రెండ్స్‌లా కలిసుంటారు. ఒక మంచిరోజు చూసి కీర్తికి ప్రపోజ్ చేద్దాం అనుకుని ఫోన్ చేస్తాడు అర్జున్. ఫోన్ స్విఛాఫ్ వస్తుంది. హీరోయిన్ ఇంటికి వెళతాడు, ఇల్లు తాళం వేసి ఉంటుంది. ఒక్కసారిగా పిచ్చోడిలా కీర్తి కోసం తిరుగుతుంటాడు అర్జున్. అలా మిస్ అయిన కీర్తి ఎక్కడికి వెళ్లిపోయింది? అసలు ఏం జరిగింది? వీళ్లిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారా? లేదా? సడెన్‌గా కీర్తి ఎందుకు మిస్ అయ్యింది? చివరకు అర్జున్ ఏ స్థితిలో కీర్తిని కలుస్తాడు? మళ్లీ కలిసిన తర్వాత వీరు మళ్లీ ప్రేమించుకుంటారా? అసలు వీరిద్దరిలో ఎవరు, ఎవరిని ప్రేమిస్తారు? అనేది తర్వాత కథ.
చిన్న ప్రేమ కథను ఎంత క్యూట్‌గా తీయెచ్చో తన మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకున్నారు దర్శకురాలు దివ్యభావన. మొదటి సినిమా ఎంతో ఛాలెంజింగ్‌గా లేడీ డైరెక్టర్ తెరకెక్కించింది. సినిమాలో పాటలు బావున్నాయి. సినిమా రిలీజ్ కి ముందే పాటలు మంచి హిట్ అవ్వడంతో సినిమాకు ప్లస్ అయింది. బ్రేకప్‌సాంగ్‌లో హీరో డాన్స్‌లు చక్కగా కుదిరాయి. కెమెరామెన్ వేణు తన పనితనాన్ని చక్కగా చూపించాడు. కొన్నిచోట్ల వచ్చే ఎమోషనల్ సీన్స్, డైలాగ్స్ సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్‌లవ్‌కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. అది ‘ఓ సాథియా’ సినిమాలో అందరికి గుర్తొస్తుంది.
సింపుల్ కథ, కథనం, కెమెరా వర్క్, పాటలు, నటీనటుల పనితీరు, క్లైమాక్స్ సీన్స్ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. చిన్న సినిమా అయినా నిర్మాతలు ఎక్కడా రాజి పడకుండా నిర్మించారు. సినిమాలో ఆ నిర్మాణ విలువలు కనపడతాయి. కాకపోతే ఫస్టాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. చాలావరకు ఇది రెగ్యులర్ స్టోరీనే. కాకపోతే కొత్తగా చూపించడానికి ట్రై చేశారు. రీసెంట్ టైమ్‌లో ఓ మంచి డీసెంట్ లవ్‌స్టోరీ చూశామన్న ఫీల్ కలుగుతుంది.