హాలీవుడ్‌కూ కరోనా ఎఫెక్ట్ – టామ్ క్రూజ్ సినిమా వాయిదా

హాలీవుడ్ మూవీ ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ సినిమా షూటింగ్ వాయిదా పడింది..

  • Published By: sekhar ,Published On : February 26, 2020 / 09:12 AM IST
హాలీవుడ్‌కూ కరోనా ఎఫెక్ట్ – టామ్ క్రూజ్ సినిమా వాయిదా

Updated On : February 26, 2020 / 9:12 AM IST

హాలీవుడ్ మూవీ ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ సినిమా షూటింగ్ వాయిదా పడింది..

గతకొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తోంది మహమ్మారి కరోనా వైరస్.. చైనా, జపాన్, సౌత్ కొరియా వంటి ప్రాంతాలకు బయటప్రదేశాలనుండి రాకపోకలు ఆగిపోయాయి. కరోనా ఎఫెక్ట్ సినిమా షూటింగులపై కూడా పడింది. హాలీవుడ్‌ యాక్షన్‌ మూవీస్‌ని లైక్ చేసే వారికి ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సిరీస్‌ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు.

ఇప్పటి వరకూ ఈ సిరీస్‌లో ఆరు భాగాలు వచ్చాయి. ఏడో భాగం (మిషన్‌ ఇంపాజిబుల్‌ 7) సెట్స్‌ మీద ఉంది. అన్ని భాగాల్లోనూ హీరోగా నటిస్తూ వస్తున్న టామ్‌ క్రూజ్‌ ఏడో భాగంలోనూ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ అమెరికన్‌ యాక్షన్‌ స్పై ఫిల్మ్‌పై కరోనా ఎఫెక్ట్‌ పడింది.

 

కొద్దిరోజుల ముందే ఇటలీలో మూడు వారాల షెడ్యూల్‌ని ప్లాన్‌ చేశారు. అయితే అక్కడ కరోనా వైరస్‌ వ్యాప్తి విస్తృతంగా ఉండటంతో చిత్రనిర్మాణ సంస్థ పారామౌంట్‌ పిక్చర్స్‌ ఈ షెడ్యూల్‌ని వాయిదా వేసింది. వచ్చే ఏడాది జూలై 23న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.