Mithun Chakraborty : ఆసుపత్రిలో చేరిన ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో

ఒకప్పటి స్టార్ హీరో, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవరి ఆసుపత్రిలో చేరారు. 80, 90లలో హీరోగా బెంగాలీ, హిందీ సినిమాలలో...............

Mithun Chakraborty : ఆసుపత్రిలో చేరిన ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో

Mithun

Updated On : May 3, 2022 / 7:38 AM IST

 

Mithun Chakraborty :  ఒకప్పటి స్టార్ హీరో, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవరి ఆసుపత్రిలో చేరారు. 80, 90లలో హీరోగా బెంగాలీ, హిందీ సినిమాలలో చక్రం తిప్పిన మిథున్‌ చక్రవర్తి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. ఇటీవలే మిథున్‌ ‘ది కాశ్మీర్‌ ఫైల్స్’ సినిమాతో మెప్పించారు. మిథున్ హాస్పిటల్ లో ఉన్న ఓ ఫోటోని షేర్ చేసి ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను అంటూ బీజేపీ నాయకుడు అనుపమ్‌ హజ్రా ట్వీట్ చేయగా మిథున్ కి ఏమైంది అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. మిథున్ ఆసుపత్రిలో చేరారని తెలిసి అభిమానులు ఆందోళనకి గురయ్యారు.

RGV : లేడీ సర్కార్ అంటూ.. విశ్వక్ సేన్, యాంకర్ గొడవపై కామెంట్స్ చేసిన ఆర్జీవీ..

ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో మిథున్ తనయుడు మిమో చక్రవర్తి మీడియాతో మాట్లాడారు. మిమో మాట్లాడుతూ.. ఆయన కిడ్నీలో స్టోన్స్ కారణంగా హాస్పిటల్ లో చేరారని, ఆపరేషన్ జరిగిందని, ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపాడు. ఆయన డిశ్చార్జ్ అయ్యారని తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.