Mohan Babu : బాబోయ్.. మోహన్ బాబునే భయపెడుతున్న మనవడు.. వీడియో వైరల్..
తాజాగా మోహన్ బాబుకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.(Mohan Babu)
Mohan Babu
Mohan Babu : మోహన్ బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నారు. త్వరలో ది ప్యారడైజ్, శ్రీనివాస మంగాపురం సినిమాలతో పవర్ ఫుల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా మోహన్ బాబుకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.
మోహన్ బాబు, మంచు విష్ణు, విష్ణు కొడుకు అవ్రామ్ కలిసి ఈ వీడియోలో సందడి చేసారు. విష్ణు కొడుకు, మోహన్ బాబు మనవడు అవ్రామ్ తన అల్లరితో రచ్చ చేసాడు. తండ్రిని, తాతని భయపెట్టాడు. మోహన్ బాబు సైలెంట్ గా ఉండు, చెప్పిన మాట విను అన్నా కూడా నేను వినను బాబు అంటూ మోహన్ బాబు పైకి వచ్చి అవ్రామ్ అల్లరి చేసాడు. అవ్రామ్ అల్లరికి మోహన్ బాబు సైతం సైలెంట్ అయిపోయాడు.
Also See : Neha Sharma : పంజాబ్ కింగ్స్ కి సపోర్ట్ చేస్తున్న చిరుత భామ.. స్టేడియంలో సందడి.. ఫొటోలు..
తండ్రి విష్ణు పైకి ఎక్కి మరీ అల్లరి చేసాడు అవ్రామ్. కాసేపు అక్కడ రచ్చ రచ్చ చేసి సైలెంట్ గా బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. దీంతో అవ్రామ్ అల్లరి చేసిన ఈ క్యూట్ వీడియో వైరల్ గా మారింది. అవ్రామ్ తన అల్లరితో చిన్నప్పుడే తండ్రిని, తాతని భయపెడుతున్నాడుగా అని మంచు ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అవ్రామ్ ఇప్పటికే కన్నప్ప సినిమాలో నటించాడు.
అవ్రామ్ అల్లరి చేసిన వీడియో మీరు కూడా చూసేయండి..
The Lion King faced villains, critics, and the toughest roles… But nothing prepared him for Avram’s 3-minute attack. 💀😂 #familybond #MohanBabu pic.twitter.com/IGKTSSqQ2L
— manchuvishnutrends (@manchuvishnufan) April 15, 2026
