Mohanlal : హేమ రిపోర్ట్ వల్లే.. మోహన్ లాల్ రాజీనామా..?

ప్రస్తుతం మలయాళ సినీ పరిశ్రమలో హేమ రిపోర్ట్ సంచలనాలు సృష్టిస్తుంది.

Mohanlal :  హేమ రిపోర్ట్ వల్లే.. మోహన్ లాల్ రాజీనామా..?

Mohanlal Resigned for President Post of Association of Malayalam Movie Artists

Updated On : August 27, 2024 / 5:13 PM IST

Mohanlal : ప్రస్తుతం మలయాళ సినీ పరిశ్రమలో హేమ రిపోర్ట్ సంచలనాలు సృష్టిస్తుంది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయని, చాలా మంది నటీమణులు క్యాస్టింగ్ కౌచ్ కి బాధితులు అవుతున్నారని హేమ రిపోర్టు నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో పలువురు నటీమణులు కూడా నోరు విప్పి తాము క్యాస్టింగ్ కౌచ్ బాధితులమే అని చెప్తున్నారు.

అయితే ప్రస్తుతం మలయాళం స్టార్ యాక్టర్ మోహన్ లాల్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(AMMA) కు ప్రసిడెంట్ గా ఉండగా ఆ పదవికి తాజాగా రాజీనామా చేసారు. మోహన్ లాల్ మాత్రమే కాక అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ లోని మెంబర్స్ అందరూ కూడా రాజీనామా చేయడంతో మలయాళ సినీ పరిశ్రమలో ఈ విషయం సంచలనంగా మారింది.

Also Read : Pawan Kalyan – OG : పవన్ కోసం విజయవాడలో ముంబై సెట్..? OG సినిమా కోసం..

అయితే హేమ రిపోర్ట్ నివేదిక వల్లే, మహిళా ఆర్టిస్టులపై జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ అసోసియేషన్ పట్టించుకోవట్లేదు అనే ఆరోపణల నేపథ్యంలోనే మోహన్ లాల్, అసోసియేషన్ కమిటీ అంతా రాజీనామా చేసారని అంతా అనుకుంటున్నారు. మళ్ళీ రెండు నెలల్లో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ ఎన్నికలు నిర్వహించి కొత్త కమిటీ ఎన్నుకుంటారని తెలుస్తుంది.