mollywood villain : పుష్ప విలన్ ఇతడే, బన్నీతో పోరాటం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న న్యూ ఫిల్మ్ ‘పుష్ప’ మూవీ నుంచి వీకెండ్ సర్ ఫ్రైజ్ వచ్చింది.

mollywood villain : పుష్ప విలన్ ఇతడే, బన్నీతో పోరాటం

VillainOfPushpa

Updated On : March 21, 2021 / 2:00 PM IST

allu arjun Film pushpa : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న న్యూ ఫిల్మ్ ‘పుష్ప’ మూవీ నుంచి వీకెండ్ సర్ ఫ్రైజ్ వచ్చింది. ఫుల్ మాస్ గా కనిపించే బన్నీతో పోరాటం చేసేది ఎవరబ్బా..అంటూ ఫ్యాన్స్ తెగ చర్చించుకున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టింది చిత్ర యూనిట్. మలయాళ నటుడు ఫవాద్‌ ఫాజిల్‌ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు చెబుతూ ఆయన ఫొటోను మైత్రిమూవీ మేకర్స్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ‘పుష్ప’ విలన్ కు సంబంధించిన వీడియో ప్రతొక్కరినీ ఆకట్టుకొంటోంది.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కలపను అక్రమంగా రవాణా చేసే లారీ డ్రైవర్ పాత్రలో ‘పుష్ప రాజ్’ గా బన్నీ కనిపించబోతున్నాడు.
విలన్ క్యారెక్టర్ కోసం ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతిని అనుకున్నారు కానీ డేట్స్ ప్రాబ్లమ్ వల్ల కుదరలేదు. ఆ పాత్రనే సునీల్ చేత చేయిస్తున్నారనే టాక్ కూడా వినిపించింది. చివరకు ఫవాద్ ను ఎంచుకున్నారు. మలయాళం చిత్ర పరిశ్రమ నుంచి టాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు ఇతను. పాజిల్ తన నటనతో జాతీయ అవార్డును ఇప్పటికే అందుకున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వీడియో రిలీజ్ చేసింది. తొలిసారిగా బన్నీతో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా జోడీ కడుతోంది.

‘ఆర్య, ఆర్య-2’ తర్వాత బన్నీ-సుక్కు కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్ట్‌ 13న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.